Homeసినిమా వార్తలుMythri movie makers: మైత్రీ టీమ్ దిల్ రాజుని థియేటర్స్ కోసం రిక్వెస్ట్ చేస్తుందా?

Mythri movie makers: మైత్రీ టీమ్ దిల్ రాజుని థియేటర్స్ కోసం రిక్వెస్ట్ చేస్తుందా?

- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్‌తో పోరాడాలని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకున్నారు. మరి ఈ ఇద్దరూ పోరాడే యుద్ధభూమి మరేదో కాదు 2023 సంక్రాంతి పండగ పోరు. వచ్చే సంక్రాంతికి ఈ రెండు నిర్మాణ సంస్థలు భారీ సినిమాలను విడుదల చేస్తున్నాయి.

మైత్రీ సంస్థ వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి చిత్రాలతో వస్తుండగా, దిల్ రాజు తమిళ హీరో విజయ్ వారిసు సినిమాని తెలుగులో వారసుడుగా మరియు అజిత్ యొక్క తునివును తేగింపుగా విడుదల చేస్తున్నారు. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ తమ రెండు చిత్రాలను పండుగకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత, దిల్ రాజు తన చిత్రాలకు వీలైనన్ని ఎక్కువ థియేటర్లను ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవలి ఇంటర్వ్యూలో, దిల్ రాజు “మీరు డిస్ట్రిబ్యూటర్ అయితే థియేటర్ల కోసం ఎగ్జిబిటర్లను లేదా ఇతర డిస్ట్రిబ్యూటర్లను అడగాలి” అని స్పష్టంగా చెప్పారు, నేను వారిసుకు తగినంత థియేటర్లు రాకపోవడంతో తమిళనాడులో కూడా అదే చేయాలని ప్లాన్ చేసాను. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పటికీ మైత్రీ మూవీస్ టీమ్ నన్ను కలవలేదు, థియేటర్స్ కోసం రిక్వెస్ట్ చేయలేదు కాబట్టి నా సొంత సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వారి సినిమాలకి నా థియేటర్స్ ఎలా ఇవ్వగలను అని అన్నారు.

READ  స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని సమర్ధించని అగ్ర నిర్మాతలు

ఇది ఖచ్చితంగా దిల్ రాజు నుంచి లౌక్యం ఉన్న పాయింట్ యే అని చెప్పవచ్చు. ఈ వ్యాఖ్యల తర్వాత అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఏమిటంటే ఇప్పటికైనా మైత్రీ టీమ్ దిల్ రాజుని కలవడానికి ప్రయత్నిస్తుందా, నైజాం మరియు ఉత్తరాంధ్రలో థియేటర్ల కోసం అభ్యర్థిస్తుందా లేదా అన్నదే.

మైత్రీ మూవీస్ తమ సినిమాలను నైజాం డిస్ట్రిబ్యూషన్ కోసం దిల్ రాజుకి ఇవ్వకూడదని నిర్ణయించుకోవడంతో ఈ సమస్య మొదలైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నైజాంలో సొంతంగా డిస్ట్రిబ్యూష‌న్ ఏర్పాటు చేసి దిల్ రాజుకి నేరుగా పోటీ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు.

మరో వైపు, దిల్ రాజుకు ఏదైనా సంఘటన లేదా ఎలాంటి పరిస్థితిని అయినా తన చర్యలు లేదా మాటలన్నీ సరైనవే అనిపించే విధంగా మార్చగల నేర్పు ఉంది. ఆయన తరచూ తన వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు మరియు పరిస్థితులకు అనుగుణంగా తన మాటలను మార్చుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌, కాంటాక్ట్స్‌తో థియేటర్‌ కేటాయింపులు జరుగుతాయని అన్న దిల్ రాజు, తమిళంలో మాత్రం విజయ్‌ స్టార్‌ హీరో కాబట్టి తన సినిమాకి ఎక్కువ థియేటర్లు కావాలని అనడం చిత్రంగా ఉంది. మరి వారసుడు రిలీజ్ సందర్భంగా ఆయన నుంచి ఇంకెన్ని చిత్రమైన స్టేట్మెంట్స్ వస్తాయో చూడాలి మరి.

READ  Suguna Sundari: వీరసింహారెడ్డి కొత్త పాటలో దుమ్ము దులిపేసిన బాలయ్య

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories