Homeసినిమా వార్తలురామ్ చరణ్ దగ్గరకి వచ్చిన అల్లు అర్జున్ సినిమా?

రామ్ చరణ్ దగ్గరకి వచ్చిన అల్లు అర్జున్ సినిమా?

- Advertisement -

సినిమా పరిశ్రమలో ఒక హీరోకు అనుకున్న కథ ఇంకో హీరో దగ్గరకి వెళ్ళడం.. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత ఒక హీరో స్థానంలో ఇంకో హీరో వచ్చి చేరడం ఇవన్నీ సాధారణంగా జరిగేవే. అలాంటి కొన్ని యాదృచ్ఛిక సంఘటనల వల్ల ఒక్కోసారి బ్లాక్ బస్టర్ సినిమాలు చేజారిన హీరోలు ఉంటే.. అనుకోకుండా డిజాస్టర్ సినిమాలు సాధించిన హీరోలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో దగ్గరకి వెళ్ళనుందనే ఒక వార్త టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది నటించిన ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. సృజనాత్మక ఆలోచనలను ఆసక్తికరంగా తెరకెక్కించే దర్శకుడు సుకుమార్.. పుష్ప సినిమాని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి అల్లు అర్జున్ స్టార్డం ను తారాస్థాయికి తీసుకెళ్లింది. అంతే కాకుండా అందరినీ ఆశ్చర్య పరుస్తూ.. కరోనా మహమ్మారి అందరినీ భయభ్రాంతులని చేస్తున్న సమయంలో వచ్చి హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ సినిమా అనూహ్యంగా అక్కడ 100 కోట్లకు మించి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ సంచలన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2ని మరింత భారీ స్థాయిలో తెర పైకి తీసుకురాబోతున్నారు.

ఇదిలా ఉండగా ‘పుష్ప’ సినిమాకి ముందు అల్లు అర్జున్ చేయాల్సిన ‘ ఐకాన్ ‘ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా.. ఆ సినిమా నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించాలని సన్నాహాలు చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ వదిలేసి సుకుమార్ తో ‘పుష్ప’ చేయడానికి వెళ్లడంతో దీన్ని పక్కన పెట్టారు. కాగా ఇదే సమయంలో దర్శకుడు వేణు శ్రీరామ్ .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘వకీల్ సాబ్’ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

READ  రెండు పడవల్లో ప్రయాణం చేయనున్న శంకర్

ఆ తరువాత ‘పుష్ప’ విడుదలై ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత కూడా అల్లు అర్జున్.. వేణు శ్రీరామ్ సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ‘పుష్ప’ సినిమాని రెండు భాగాలుగా చేయాలని సంకల్పించడంతో బన్నీ ఇప్పుడు పూర్తిగా ‘పుష్ప’ ప్రాజెక్ట్ కే అంకితం అయిపోయారు.

దీంతో దర్శకుడు వేణు శ్రీరామ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఐకాన్’ ని ఇతర హీరోలతో చేయడానికి నిర్ణయించుకుని ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం మొదలు పెట్టారు.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఐకాన్ కథను హీరో రామ్ చరణ్ కు వినిపించారట. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ స్క్రిప్ట్ ను ఓకే చేస్తారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయాలి. అయితే ఆ సినిమా రద్దు చేశారని ఇటీవలే పుకార్లు వచ్చాయి.

READ  దర్శకుల కెరీర్ తో ఆడుకుంటున్న రామ్ చరణ్ - ఎన్టీఆర్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories