Homeసినిమా వార్తలుRRR: రామ్ చరణ్ - ఎన్టీఆర్ వేర్వేరుగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారు?

RRR: రామ్ చరణ్ – ఎన్టీఆర్ వేర్వేరుగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారు?

- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ సినిమా యొక్క ఆస్కార్ ప్రమోషన్స్ ను గమనిస్తే… రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఇటీవల ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ మొదట యూఎస్ఏ వెళ్లగా తారకరత్న మృతి వల్ల ఎన్టీఆర్ ఇండియాలోనే ఉండి పోవాల్సి వచ్చింది. దాంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా తాలూకు ప్రచార కార్యక్రమాలలో ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి.

5 రోజుల క్రితం ఎన్టీఆర్ యూఎస్ఏకు వెళ్లినా ఇప్పటికీ ఇద్దరు స్టార్స్ కలిసి దిగిన ఫొటోలు ఏవీ బయటకి రాకపోగా.. మునుపటిలా కలిసి కాకుండా ఇద్దరూ విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కాగా ప్రచారంలో భాగంగా ఈ ఇద్దరు తారలు హాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి కొన్ని ఫొటోలు దిగి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

అయితే అటు మెగా ఇటు నందమూరి అభిమానుల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే ఈసారి హీరోల కోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తే బాగుంటుందని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావించి ఉండొచ్చని కొందరు అభిమానులు, నెటిజన్లు అంటున్నారు. కారణం ఏదైతేనేం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో అత్యంత, చివరి క్షణాల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ కలిసి చూడాలని అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు.

READ  RRR: ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచిన ఆర్ ఆర్ ఆర్

ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డుకు మరో అడుగు దూరంలో ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట నామినేట్ అయింది. అయితే ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు భారీ స్థాయిలో ఉన్నాయి కానీ ఇంతగా ప్రమోషన్స్ చేసిన తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు రాకపోతే పరిస్థితి ఏంటని కొందరు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఆర్ఆర్ఆర్ చిత్రం సాధించిన విజయానికి, గుర్తింపుకు ఆస్కార్ అవార్డులు కొలమానం కాదని చెప్పవచ్చు. ఒకవేళ ఆస్కార్ అవార్డ్ వస్తే మాత్రం అందరి మన్ననలకు అదనపు బహుమతిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow on Google News Follow on Whatsapp

READ  RC15: ఆర్ సి 15 కోసం పనిచేస్తున్న టాప్ కొరియోగ్రాఫర్లు - పాటలకు షాకింగ్ బడ్జెట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories