Homeసినిమా వార్తలుRRR: ఆస్కార్ నామినేషన్ల తర్వాత సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్

RRR: ఆస్కార్ నామినేషన్ల తర్వాత సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్

- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైనప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా విజయంలో తమ హీరోదే ప్రధాన పాత్ర అని, చిత్ర విజయంలో మరో హీరో సహకారం తక్కువని నిరూపించుకోవడానికి రెండు ఫ్యాన్ బేస్ లు తహతహలాడుతున్నాయి.

కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారి, అన్ని దేశాల ప్రేక్షకులను తన బీట్ కు కట్టిపడేసిన చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలిచిన నాటు నాటు పాట, తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా గర్వపడేలా చేసి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుకు నామినేషన్ సాధించి తన విజయ పరంపరను కొనసాగించింది.

https://twitter.com/RRRMovie/status/1617884085539729410?t=9JGGUoneJOIuIsKGcTe3SQ&s=19

అయితే ఆస్కార్ నామినేషన్లు వచ్చిన తర్వాత ఉత్తమ నటుడు ఆస్కార్ నామినేషన్ కు ఇరు హీరోలలో ఎవరూ ఎంపిక కాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు, మెగా అభిమానులు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు.

చరణ్ పిఆర్ టీం ఫేక్ పబ్లిసిటీ కోసం, హైప్ కోసం భారీగా డబ్బులు వెచ్చించిన తర్వాత కూడా ఆస్కార్ అవార్డుకు నామినేట్ కాలేదని ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తూ ఉంటే.. అదే విధంగా మెగా అభిమానులు కూడా మీరు పెయిడ్ క్యాంపెయిన్స్ చేశారని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి ఇటువంటి చవకబారు గొడవలతో తమ హీరోల కష్టాన్ని, ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన ఘనకీర్తిని కించపరుస్తున్నారని తెలుసుకోకుండా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పలు హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోలకు ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల అమితమైన ఆదరణ లభించిందని సంతోషించడానికి బదులు అనవసరమైన ఫ్యాన్ వార్లకు పాల్పడుతున్నారు.

READ  RRR: 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు బిగ్ డే, ఆస్కార్ లిస్ట్ లో చోటు దక్కుతుందా?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories