సినిమా పేరు: వార్ 2
రేటింగ్: 2/5
తారాగణం: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా, అనిల్ కపూర్, మరియు ఇతరులు
దర్శకుడు: అయాన్ ముఖర్జీ
నిర్మాత: యష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ: 14 ఆగస్టు 2025
టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీ వార్ 2 .ఈ మూవీలో మరొక స్టార్ నటుడు హృతిక్ రోషన్ కూడా నటించగా దీనిని యువ బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.
యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీలో కియారా అద్వానీ, అశుతోష్ రానా, అనిల్ కపూర్ కీలక పాత్రలు చేసారు. మరి నేడు గ్రాండ్ గా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
ఈ మూవీలో స్నేహితులైన హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ తమ వ్యక్తిగత నిర్ణయాల వలన ఒకప్పుడు విడిపోతారు. అయితే దేశానికి సంబదించిన ఒక కీలక అంశం విషయమై వాళ్లిద్దరూ ఒక సందర్భంలో కలుస్తారు. అయితే ఆ అంశం ఏమిటి, వాళ్ళిద్దరి ఆ అడ్వెంచర్ కలయిక కి కారణం ఏమిటి, ఆ తరువాత ఏమి జరిగింది అనేది మొత్తం కూడా మనం మూవీలో చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముఖ్యంగా ఈ మూవీలో అటు ఎన్టీఆర్, ఇటు హృతిక్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో అదరగొట్టే పెరఫార్మన్క్ కనబరిచారు. యాక్టింగ్ పవర్ హౌస్ అయిన ఎన్టీఆర్ యాక్టింగ్ ఎంతో బాగుంటుంది. ఇక హృతిక్ కూడా కబీర్ గా మరొక్కసారి పెర్ఫార్మన్స్ అలరించాడు.
అయితే వీరిలో హృతిక్ పాత్రలో ఆయన పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఒకరకంగా అయన పాత్ర ప్రకారం పూర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ అనాలి. తన యాక్టింగ్ బాగున్నా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న సీన్స్ తక్కువ.
ఇక అశుతోష్ రానా తో పాటు అనిల్ కపూర్ కూడా పరిధి మేరకు అలరించారు. హీరోయిన్ గా కీలక పాత్ర చేసిన కియారా అద్వానీ కూడా ఒక సాంగ్ లో ఆకట్టుకోవడంతో పాటు అక్కడక్కడా అలరించింది.
విశ్లేషణ :
దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంచుకున్న వార్ 2 కథ జపాన్ లో హృతిక్ రోషన్ యాక్షన్ సీన్ తో ప్రారంభం అవుతుంది. అలానే ఎన్టీఆర్ ఇంట్రో తో పాటు ఇద్దరి మధ్య పేస్ టూ పేస్ ఘర్షణ సీన్స్ కి సరిపోయే బ్యాక్ డ్రాప్ ని బాగానే రాసుకున్నాడు.
అనంతరం వచ్చే యాక్షన్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా చప్పగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ కూడా అంత ఆసక్తికరంగా లేకపోయినప్పటికీ ఇద్దరు స్టార్ హీరోల డ్యాన్స్ నంబర్ సలాం అనాలి ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇద్దరు నటుల మధ్య అనుబంధాన్ని కథని ఆవిష్కరిస్తాయి.
హృతిక్, కియారా మధ్య సీన్స్ ప్రశాంతంగా సాగుతాయి. సారంగ మరణ సన్నివేశం, అలానే ఎన్టీఆర్, హృతిక్ ల మధ్య సాగే క్లైమాక్స్ యాక్షన్ సీన్ యొక్క షాట్స్ బాగున్నా దానిని దర్శకుడు అంతగా ఆకట్టుకునేలా తీయలేకపోయాడు.
ప్లస్ పాయింట్స్ :
- ఇద్దరు హీరోల పరిచయ సన్నివేశాలు
- బోట్ ఛేజ్ సీన్
- హృతిక్-ఎన్టీఆర్ మధ్య కొన్ని సన్నివేశాలు / సంభాషణలు
మైనస్ పాయింట్స్:
- విసుగు పుట్టించే కథనం
- నీరసమైన యాక్షన్ భాగాలు
- పేలవమైన VFX
- బలహీనమైన భావోద్వేగాలు / హృతిక్-ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ
తీర్పు :
మొత్తంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి తొలిసారిగా నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2 టార్గెట్ ని మిస్ అయింది అని చెప్పకతప్పదు. ఇది ఒక ఫెయిల్ అయిన మిషన్. ఇద్దరు నటుల పెర్ఫార్మన్స్ తో పాటు అక్కడక్కడా అలరించే కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప ఏమాత్రం పెద్దగా ఇంట్రెస్టింగ్ గా సాగని కథనం మైనస్.