Homeసినిమా వార్తలుWaltair Veerayya: వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లలో ప్రేక్షకులను విశేష స్థాయిలో అలరించిన తర్వాత ఇక ఓటీటీ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. వాల్తేరు వీరయ్య ఓటీటీ విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఈ సంక్రాంతి సీజన్ లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించి అటు మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు ఒక కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజ్ అందించింది.

https://twitter.com/Netflix_INSouth/status/1622861389168775168?t=BVf-0XIgi4R2w71OR0knrw&s=19

వాల్తేరు వీరయ్య ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని దిగ్గజ ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫెస్టివల్ రిలీజ్, మెగాస్టార్ బాక్సాఫీస్ పుల్ కారణంగా చాలా మంది ఊహించిన దానికంటే బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన వాల్తేరు వీరయ్య ఓటీటీ విడుదల అయి నెట్ ఫ్లిక్స్ లో కూడా కొన్ని మైలురాళ్లను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

ఈ చిత్రం థియేట్రికల్ రన్ అయిన 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ను సాధించి అతి తక్కువ సమయంలోనే 100 కోట్ల షేర్ ను సాధించింది. వాల్తేరు వీరయ్య ఒకదాని తర్వాత మరొకటి అనేక రికార్డులు నెలకొల్పి కేవలం నైజాంలో 50 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లలో టాలీవుడ్ టాప్ 10 సినిమాల్లో 6వ స్థానంలో నిలవడం గమనార్హం.

READ  Raviteja: బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో పాటు నటన పరంగా సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ

చిరంజీవి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, రవితేజ ఎనర్జీ మరియు మాస్ అప్పీల్ తో నిండిన పెర్ఫార్మెన్స్ కలిసి భారీ డోస్ ఎంటర్టైన్మెంట్ ను అందించి వాల్తేరు వీరయ్య సినిమాని ప్రేక్షకుల ఫేవరెట్ గా నిలబెట్టాయి.

బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్ వంటి పాటలు సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమా విజయంలో ఆయన కూడా ఒక కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Bhola Shankar: భోళా శంకర్ మేకర్స్ కు పెద్ద ప్లస్ గా మారిన వాల్తేరు వీరయ్య సక్సెస్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories