మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం వాల్తేరు వీరయ్యతో ఈ సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య సెన్సార్ గురించి, సినిమా రిపోర్ట్ గూర్చిన సమాచారం గురించి అనేక రకాల పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు వివరాలు బయటకు వచ్చాయి.
వాల్తేరు వీరయ్య ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు (160 నిమిషాలు) ఉంటుందని తెలిసింది.
కమర్షియల్ సినిమాకు ఇది పర్ఫెక్ట్ రన్ టైమ్ అని చెప్పవచ్చు, సెన్సార్ టీమ్ నుండి చాలా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందట మరియు షో పూర్తయిన తరువాత సెన్సార్ యూనిట్ వాల్తేరు వీరయ్య చిత్ర బృందాన్ని అభినందించిందని అంటున్నారు.
గతంలో ‘జై లవ కుశ’, ‘పవర్’, ‘వెంకీ మామ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఆయన మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇక వాల్తేరు వీరయ్య పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
బాస్ పార్టీ సాంగ్ బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఇటీవల విడుదలైన పూనకాలు లోడింగ్ సాంగ్ కూడా మంచి స్పందనను పొందుతుంది. వీరయ్య టైటిల్ సాంగ్ కూడా ఓవరాల్ గా డీసెంట్ గా ఉందనే చెప్పాలి. పాటలు ఈ సినిమా ప్రజల్లో మరింత చేరువ కావడానికి సహాయపడ్డాయి.
వాల్తేరు వీరయ్య చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించగా, మాస్ మహారాజా రవితేజ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, కేథరిన్ థ్రెసా ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.