యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా అందాల అంటి కావ్య థాపర్ హీరోయిన్ గా చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన లేటెస్ట్ మూవీ విశ్వం. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీలో వికె నరేష్, వెన్నెల కిశోర్, విటివి గణేష్, సునీల్, ప్రగతి తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫామిలీ యక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శ్రీను వైట్ల దీనిని తెరకెక్కించారు. అయితే విశ్వం మూవీ రిజల్ట్ తో దర్శకుడు శ్రీను కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అయితే అందుకోలేదు కానీ పర్వాలేదనిపించే విజయం అందుకున్నారు.
ముఖ్యంగా ఈ మూవీలో ట్రైన్ కామెడీ సీన్స్ తో పాటు అక్కడక్కడా పలు సీన్స్ ఆడియన్స్ ని అలరించాయి. ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం అతి త్వరలో ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వారు రూ. 12 కోట్లకు విశ్వం ఓటిటి రైట్స్ సొంతం చేసుకున్నారు. మరి ఈ మూవీ ఓటిటి లో రిలీజ్ అనంతరం ఎంతమేరకు ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.