Homeసినిమా వార్తలుVishwak Sen: లాంఛనంగా ప్రారంభమైన విశ్వక్ సేన్ కొత్త సినిమా

Vishwak Sen: లాంఛనంగా ప్రారంభమైన విశ్వక్ సేన్ కొత్త సినిమా

- Advertisement -

విలక్షణ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ, తన ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్తదనాన్ని చూపించడానికి ఎంతగానో కృషి చేస్తుంటారు యువ హీరో విశ్వక్ సేన్ . నటుడిగానే కాకుండా సక్సెస్ ఫుల్ రైటర్-డైరెక్టర్ గా కూడా నిలిచారు విశ్వక్. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఆయన తదుపరి చిత్రం VS 11 ను గత నెలలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమా జానర్, స్క్రిప్ట్ చాలా వైవిధ్యంగా ఉంటాయని సమాచారం అందుతోంది. విశ్వక్ సేన్ ఈ పాత్రను పోషించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నారని అంటున్నారు.

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘వి.ఎస్.11’ చిత్రం ఈ రోజు సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

https://twitter.com/SitharaEnts/status/1651125184676638721?t=mvbn19sUXGbRrpthmikXRA&s=19

కాగా ఈ పూజా కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిల్ రాజు, బోయినపల్లి వెంకట్, సుధాకర్ చెరుకూరి, రామ్ ఆచంట, గోపి ఆచంట, సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు మల్లిక్ రామ్, దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి, దర్శకుడు కళ్యాణ్ శంకర్ తదితరులు హాజరై చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలిపారు.

READ  Ponniyin Selvan 2: పొన్నియిన్ సెల్వన్ 2 సెన్సార్ రిపోర్ట్ మరియు వివరాలు

90వ దశకంలో రాజమండ్రి పరిసర ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న వీఎస్ 11 సినిమా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ రోజు పూజా కార్యక్రమంలో విశ్వక్ సేన్ సరికొత్త లుక్ లో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం: అనిత్ మధాని, ఎడిటింగ్: జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి.

మే నుంచి VS 11 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడికానున్నాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అయిన విశ్వక్ సేన్ రాబోయే చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.

Follow on Google News Follow on Whatsapp

READ  Orange: బర్త్ డే రీ రిలీజ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ చరణ్ ఆరెంజ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories