ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో విశ్వక్ సేన్ ను అత్యంత బిజీ స్టార్ గా పేర్కొనవచ్చు. ఆయన పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. కానీ ఆయన పేరు వినిపించినంతగా ఆయన సినిమాలు మాత్రం సందడి చేయడం లేదు.
విశ్వక్ సేన్ తాజాగా చిత్రం ఓరి దేవుడా మంచి సమీక్షలను అందుకుంది. ప్రేక్షకులు కూడా సినిమాలో మంచి కథాంశాన్ని మరియు విశ్వక్ నటనను ప్రశంసించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.
దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన ‘ఓ మై కడవులే’కి రీమేక్. విజయవంతం అయిన కథ అయినప్పటికీ.. ఎందుకో సినిమా విజయం సాధించలేకపోయింది.
ఓరి దేవుడా ఈరోజు అర్థరాత్రి నుంచి OTT ప్రీమియర్ కు సిద్ధం అవుతోంది. OTT ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్‌బస్టర్‌గా అవతరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాని యువతరం ప్రేక్షకులు మరియు రొమాంటిక్ కామెడీ శైలి ప్రేమికులు ఈ ఫన్నీ ఎంటర్‌టైనర్‌ని చూసి ఆనందించవచ్చు.
ఓరి దేవుడా కథ ఒక జంట చుట్టూ తిరుగుతుంది. అర్జున్ తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకుంటాడు. కానీ వివాహం చేసుకున్న తర్వాత అర్జున్ తన భార్య పై ప్రేమ కలగట్లేదని.. అసలు జీవితంలోనే ఆసక్తిని కోల్పోయానని భావించి ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు.
అయితే అనుకోకుండా అర్జున్ కు దేవుడు కనిపించి.. తన జీవితాన్ని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఎంటి? దాన్ని అర్జున్ సరిగ్గా ఉపయోగించుకున్నాడా? అనేది మిగతా కథ.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, పివిపి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎలోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. తమిళంలో “ఓ మై కడవులే” తీసిన దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి అతిధి పాత్రలో నటించగా.. విశ్వక్ సేన్, మిథాలీ పాల్కర్ మరియు ఆశా భట్ ప్రధాన పాత్రలు పోషించారు.