కోలీవుడ్ యువ నటుడు విశాల్ మరియు యువ నటి సాయి ధన్సిక త్వరలో ఒక్కటి కాబోతున్నారు. ముఖ్యంగా తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు వారికి కూడా వీరిద్దరూ ఎంతో సుపరిచితం. తొలిసారిగా ప్రేమ చదరంగం మూవీ ద్వారా విశాల్, మనతోడు మలైకాలం మూవీ ద్వారా సాయి ధన్సిక కోలీవుడ్ చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చారు.
ఆ తరువాత ఒక్కొక్కటిగా సినిమా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన ఈ ఇద్దరికి ప్రస్తుతం ఫ్యాన్స్, ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లుగా కొన్నాళ్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
కాగా తాజాగా తాము వివాహం చేసుకోబోతున్నట్లు విశాల్, సాయి ధన్సిక ఇద్దరూ కూడా ఒక సినిమా ఈవెంట్ లో భాగంగా అధికారికంగా ప్రకటించారు. తమ జంట ఆగష్టు 29న వివాహం చేసుకోబోతున్నామని గత కొన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు ఫైనల్ గా చెక్ పెట్టారు ఈ జంట.
మొత్తంగా ఈ న్యూస్ కొద్దిసేపటి క్రితం నుండి సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతోంది. త్వరలో వీరి పెళ్లి వేడుక సంబందించిన వెన్యూ సహా ఇతర వివరాలు అన్ని కూడా వెల్లడి కానున్నాయి పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ ఇద్దరి ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.