Homeసినిమా వార్తలుVirupakasha: బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలంటే విరూపాక్షకు సాలిడ్ టాక్ రావాలి

Virupakasha: బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలంటే విరూపాక్షకు సాలిడ్ టాక్ రావాలి

- Advertisement -

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష సినిమా గత కొన్ని రోజులుగా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 21, 2023న విడుదల కానున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించగా, సంయుక్తా మీనన్ కథానాయికగా నటించారు.

ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల లో నుండి చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసినప్పటికీ, సినిమా ట్రైలర్ కూడా బాగున్నప్పటికీ, తొలి రోజు ఈ సినిమాను చూడటానికి సాధారణ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలంటే మామూలు టాక్ అయినా లేదా యావరేజ్ టాక్ వచ్చినా సరిపోయేంత హైప్ ని ఏర్పరచుకున్న సినిమాలు ఉంటాయి.

అయితే కొన్ని సినిమాలకు కాస్త తక్కువ బజ్ ఉంటుంది. ఆ సినిమాలకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే మాత్రం పెద్ద పాజిటివ్ టాక్ చాలా అవసరం. విరూపాక్ష యొక్క థియేట్రికల్ బిజినెస్ 25 కోట్లు కావడంతో భారీ ధరలకు అమ్ముడుపోయిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కును సాధించాలంటే సూపర్ సాలిడ్ టాక్ రావాల్సిందే.

READ  Dasara: అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన దసరా బాక్సాఫీస్ పర్ఫామెన్స్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి.వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనే విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించారు.

సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించగా.. సునీల్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుకుమార్ రచనా భాద్యతలు నిర్వర్తించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  SSMB28: మహేష్ బాబు, త్రివిక్రమ్ ల మధ్య SSMB28 టైటిల్ విషయంలో సందిగ్ధత


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories