సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడైన, బలమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోని అన్ని ఏరియాల్లోనూ విపరీతమైన పట్టు సాధించిన ఈ సినిమా సోమవారం యొక్క అతి ముఖ్యమైన పరీక్షలో నెగ్గింది. ఈ చిత్రం ఈ ఏడాది 3వ క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
2023 సంవత్సరంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వ్యాపారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ లాభాలను తెచ్చిపెట్టడం రెండు సినిమాలకి మాత్రమే జరిగాయి. ఆ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ధనుష్ ‘ సార్’. ఈ రెండు సినిమాలు అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి పైన చెప్పినట్టు భారీ లాభాలను రాబట్టాయి.
ఆ తర్వాత నాని నటించిన దసరా సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే ఓవరాల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎలాంటి లాభాలను రాబట్టలేక కొన్ని ఏరియాలు నష్టాల్లో ముగిశాయి. చిన్న సినిమాగా విడుదలై సర్ ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బలగం కూడా కేవలం నైజాం ప్రాంతానికే పరిమితమైంది. బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా పలు సెంటర్లలో నష్టాలను చవిచూసింది.
మరో చిన్న సినిమా రచయిత పద్మభూషణ్ పరిమిత కేంద్రాల్లో మాత్రమే మంచి ప్రదర్శనలు ఇచ్చింది. మొత్తానికి వాల్తేరు వీరయ్య, సార్ సినిమాల తర్వాత ఇప్పుడు విరూపాక్ష ప్రతి ఏరియాలో అద్భుతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీ లాభాలను రాబట్టి ఈ ఏడాది మూడో క్లీన్ బ్లాక్ బస్టర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి.