సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష ఏప్రిల్ 21న విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన తెచ్చుకుంది. ,ఈ సినిమా సృష్టించిన థ్రిల్లింగ్ ఇంపాక్ట్ మరియు టెక్నికల్ ఎక్సలెన్స్ కు ప్రేక్షకులు మంత్రముగ్ధులవడంతో వారంతా రుద్రవనం ప్రపంచంలో లీనమైపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఎపిసోడ్ గురించి దర్శకుడు కార్తీక్ దండు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపారు.
క్లైమాక్స్ ట్విస్ట్ విరూపాక్షకు మెయిన్ ఎస్సెట్ గా మారింది. ఎందుకంటే ఆ తరహా ట్విస్ట్ ఎవరూ ఊహించలేదు. అయితే ఆ ట్విస్ట్ తన ఐడియా కాదని, క్లైమాక్స్ లోని ట్విస్ట్ కు తన తొలి ఆలోచన వేరు అని దర్శకుడు కార్తీక్ దండు వెల్లడించారి. అయితే ఈ మార్పు చేసి సినిమా ప్రస్తుత క్లైమాక్స్ ఆలోచనను సుకుమార్ పెట్టారట. సుకుమార్ చెప్పిన క్లైమాక్స్ ఐడియా విని తాను షాక్ అయ్యానని కార్తీక్ చెప్పారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుని ముందు తెలుగులో వచ్చిన స్పందన చూసి వారం రోజుల తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా హిందీ వెర్షన్ మే 5న విడుదల కానుంది.
బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి సుకుమార్ రచనా భాద్యతలను నిర్వర్తించారు.