సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష ఏప్రిల్ 21న విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా సృష్టించిన థ్రిల్లింగ్ ఇంపాక్ట్ మరియు టెక్నికల్ ఎక్సలెన్స్ కు ప్రేక్షకులు మంత్రముగ్ధులవడంతో వారంతా రుద్రవనం ప్రపంచంలో లీనమైపోయారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా ప్రదర్శింపబడటంతో ఈ సినిమా ట్రెండ్ ఎలా ఉంటుందో ట్రేడ్ సర్కిల్స్ కూడా అంచనా వేయలేక పోతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఈ సినిమా సూపర్ స్ట్రాంగ్ గా ఉండి 3 కోట్ల షేర్ వసూలు చేయగా, యూఎస్ ఏలో కూడా సోమవారం కలెక్షన్స్ 100కే డాలర్ల స్థాయిలో ఉన్నాయి. విరూపాక్ష నిజంగానే సెన్సేషనల్ గా ప్రదర్శితమవుతోంది. ఓవరాల్ గా ఈ సినిమా 4 రోజులకు వరల్డ్ వైడ్ షేర్ 24 కోట్లు దాటి బ్రేక్ – ఈవెన్ మార్క్ ను సాధించింది. కాగా ఇప్పుడు భారీ బ్లాక్ బస్టర్ స్టేటస్ దిశగా దూసుకెళ్తోంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుని ముందుగా తెలుగులో వచ్చిన స్పందన చూసి వారం రోజుల తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ మే 5న విడుదల కానుంది.
బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి సుకుమార్ రచనా భాద్యతలను నిర్వర్తించారు.