Homeసినిమా వార్తలుహారి హర వీర మల్లు సినిమా విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ స్థానంలో చేరిన బాబీ...

హారి హర వీర మల్లు సినిమా విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ స్థానంలో చేరిన బాబీ డియోల్

- Advertisement -

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా హరి హర వీర మల్లు. మొదట్లో ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌ని విలన్ పాత్ర కోసం పరిగణించారు, కానీ డేట్స్ అడ్జెస్ట్ అవని కారణంగా, అర్జున్ రాంపాల్ గౌరవంగా ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అర్జున్ రాంపాల్ స్థానంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో ఒకరి స్థానంలో మరొకరిని భర్తీ చేయడమే కాకుండా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోషించాల్సిన ఒక ముఖ్యమైన పాత్రలో నోరా ఫతేహిని భర్తీ చేసింది. అంతే కాదు హరి హర వీర మల్లు సినిమా యొక్క ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు కానీ సినిమా పట్ల ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం అలాగే ఉంది.

17వ శతాబ్దపు నేపథ్యంలో చట్టవిరుద్ధంగా అయినా సరే న్యాయాన్ని రక్షించే ఒక వీరుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రం మొఘల్ కాలం నాటి సెమీ హిస్టారికల్ ఫిక్షన్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్‌కి చాలా స్కోప్ ఉంది. మరియు పవన్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పీరియాడికల్ మూవీ మరియు హరి హర వీర మల్లు టీజర్ తో ఇప్పటికే తగినంత బజ్ క్రియేట్ చేసింది.

READ  అస్త్రావర్స్ లో అడుగు పెట్టనున్న రాకీ భాయ్

ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఖుషీ కాలం నుంచి పవన్ కళ్యాణ్‌తో ఈ నిర్మాతకు మంచి అనుబంధం ఉంది. పవర్‌స్టార్‌తో పెద్ద బ్లాక్‌బస్టర్‌ను స్కోర్ చేస్తానని ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు.

బాబీ డియోల్‌కు టాలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, బాబీ డియోల్ తో ఆయన పాత్ర మరియు కథ గురించి క్లుప్త చర్చ కోసం చిత్ర బృందం సంప్రదించారట. హరి హర వీర మల్లు 2023 వేసవిలో విడుదల కానుంది.

ప్రస్తుతం ప్యాన్ ఇండియా చలనచిత్రాల ట్రెండ్ నడుస్తోంది. మరియు బాలీవుడ్ నుండి బాబీ డియోల్, నోరా ఫతేహి వంటి ప్రముఖ తారలు ముఖ్యమైన పాత్రల్లో ఉండటం హరిహర వీర మల్లుకు నార్త్ బాక్స్ ఆఫీస్ వద్ద అవసరమైన మైలేజీని పొందడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమాతో ప్యాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సాధిస్తారని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  ఏజెంట్ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడం వెనుక పెద్ద ప్లాన్ ఏ ఉందా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories