వెబ్ సిరీస్ పేరు : వికటకవి
రేటింగ్: 3 / 5
తారాగణం: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు మీనన్, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, ముక్తార్ ఖాన్, అమిత్ తివారీ తదితరులు.
దర్శకుడు: ప్రదీప్ మద్దాలి
నిర్మాత: రజనీ తాళ్లూరి
స్ట్రీమింగ్ : జీ 5 లో
కథ :
యువ నటుడు నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ వికటకవి. అమరగిరి అనే గ్రామంలో జరిగే కథగా ఈ సిరీస్ రూపొందింది. అయితే అక్కడి దేవతల గుట్ట అనే ప్రదేశానికి వెళ్లిన వారు తమ మెమరీని కోల్పోతుంటారు. అనంతరం ఆ ఊరికి రామకృష్ణ అనే ఉస్మానియా విశ్వవిద్యాలయ స్టూడెంట్ కం డిటెక్టివ్ వస్తాడు. మరి అతడు అక్కడికి వచ్చిన అనంతరం ఆ దేవతల గుట్ట యొక్క రహస్యాన్ని ఛేదిస్తాడా, ఆ క్రమంలో అతడు ఎటువంటి పరిస్థితులని ఎదుర్కొన్నాడు అనేది మొత్తం కూడా ఈ సిరీస్ లో చూడాల్సిందే.
పెర్ఫార్మన్స్ లు :
ముఖ్యంగా నరేష్ అగస్త్య ఈ సిరీస్ లో రామకృష్ణ అనే డిటెక్టీవ్ పాత్రలో ఆకట్టుకునే రీతిలో నటన కనబరిచాడు. గతంలో వచ్చిన మత్తువదలరా 2, సేనాపతి వంటి వాటిలో ఆకట్టుకున్న నరేష్, ఇందులో మరింతగా అలరించాడు. హీరోయిన్ మేఘ ఆకాష్ ది తక్కువ స్కోప్ కలిగిన పాత్ర అయినప్పటికీ కూడా ఆమె ఆకట్టుకుంది. ఇక తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలో నటించగా ఇతర కీలక పాత్రల్లో కనిపించిన రఘు కుంచె, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి ఇలా అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో ఆడియన్స్ ని అలరించారు.
ఎనాలిసిస్ :
ముఖ్యంగా థ్రిల్లింగ్ కథ కథనాలతో రూపొందిన వికటకవి సిరీస్ ని దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆకట్టుకునే రీతిన తెరకెక్కించారని చెప్పాలి. మధ్యలో కొన్ని సస్పెన్స్, మిస్టరీ అంశాలు అలరిస్తాయి. మధ్యలో కథనాన్ని సాగదీశే కొన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా ఇబ్బంది కలిగించవు. హై టెక్నీకల్ వాల్యూస్, యాక్షన్ ఎమోషనల్ అంశాలు ఇందులో మరింత బాగా సెట్ అయ్యాయి. మొత్తంగా అయితే ఈ వారం మీరు జీ 5 లో ఈ సిరీస్ ని హ్యాపీగా చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
- ఆకర్షణీయమైన కథనం
- నరేష్ అగస్త్య మరియు తారక్ పొన్నప్పల నటన
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు కెమెరా వర్క్
- మంచి బ్యాక్‌స్టోరీ
మైనస్ పాయింట్స్ :
- విలన్ల బలహీనమైన పాత్రలు
- పెద్దగా ఆకట్టుకోని ట్విస్టులు
తీర్ప :
మొత్తంగా చెప్పాలి అంటే అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న లోపాలు కలిగినప్పటికీ థ్రిల్లింగ్ యాక్షన్ మిస్టీరియస్ సిరీస్ గా రూపొందిన వికటకవి మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ప్రధాన పాత్రలు చేసిన నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, తారక్ పొన్నప్ప సహా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. అయితే ట్విస్టులు మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉంటె ఇంకా బాగుండేదనిపిస్తుంది. ఇక నటుడు తారక్ పొన్నప్ప ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకోవడంతో పాటు టెక్నీకల్ గా సిరీస్ బాగుంది.