జనవరి 12న ‘వారసుడు’ విడుదల చేయాలని విజయ్, దిల్ రాజు టీమ్ భావించినప్పటికీ, అజిత్ తునివు విడుదల ప్రకటనతో వారి సినిమా విడుదల తేదీని జనవరి 11కి వాయిదా వేశారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం తెలుగు వర్షన్ వారసుడు కలెక్షన్లకు ప్రీ ఫెస్టివల్ డేస్ వల్ల ఇబ్బంది ఎదురవుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తమిళ వెర్షన్ మాత్రం అనుకున్న విధంగా 11 జనవరినే విడుదల చేస్తున్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాలు తమ సినిమా పై భారీ ప్రభావం చూపుతాయని దిల్ రాజు టీం అంచనా వేస్తోంది.
తెలుగులో మార్కెట్ సాధించాలని చూస్తున్న విజయ్ ఈ సినిమాకి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లిని ఎంచుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. వారసుడు విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
దిల్ రాజు వారసుడు చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమైనన్ని స్క్రీన్లను సంపాదించడంలో బిజీగా ఉండగా, ఇతర చిత్రాల విడుదల తేదీలు ఆయన ప్లాన్ అంతా మార్చుకునేలా చేశాయి.
అయితే తమిళనాట వారిసుకు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరింది. మరోవైపు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారిసు/వారసుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంది.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, శ్యామ్, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం అందించారు.