2023 జనవరి 11న పొంగల్ సీజన్ ను పురస్కరించుకుని విజయ్ నటించిన ‘ వారిసు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, తొలిరోజు యావరేజ్ టాక్ ను తెచ్చుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లు నమోదు చేస్తుంది. తొలి రోజు మాత్రం వారిసు చిత్రం తన ప్రత్యర్థి చిత్రం తునివు కంటే తక్కువ కలెక్షన్స్ రాబట్టింది.
ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా దళపతి 67(working title) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. దసరా పండుగకు కొద్ది రోజుల ముందు అంటే 2023 అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ సినిమాలో తాను నటిస్తున్నట్లు దర్శకుడు గౌతమ్ మీనన్ ఇటీవల ప్రకటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, త్రిష, మన్సూర్ అలీ ఖాన్, అర్జున్ సర్జా వంటి భారీ తారాగణం Thalapathy67 లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇది వరకే లోకేష్ కనగరాజ్ తెలిపారు. గతంలో లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ చిత్రాలతో ఈ సినిమా కథ లింక్ అయి ఉంటుంది.
తాజాగా ‘వారిసు’ సినిమా చూసిన అనంతరం లోకేశ్ కనగరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత కుటుంబ ప్రేక్షకుల కోసం తీసిన సినిమాలో విజయ్ ను ఇలా చూడటం రిఫ్రెషింగ్ గా అనిపించిందని తెలిపారు. సినిమాని తను చాలా ఎంజాయ్ చేశానని.. కెరీర్ తొలినాళ్లలో ఉన్న విజయ్ చూసిన ఫీలింగ్ కలిగిందని ఆయన అన్నారు.
విజయ్ తో చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ గురించి అడగ్గా.. ఈ సినిమా ( వారిసు) ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశాం. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి త్వరలోనే మా సినిమా అప్డేట్ కోసం ఒక డేట్ అనౌన్స్ చేస్తామని ఆయన అన్నారు.
ఈ చిత్రంలో భాగం కానున్న నటీనటుల పై అనేక రకాల ఊహాగానాలతో పాటు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగంగా ఈ సినిమా ఉండటంతో తమిళ సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందన్న వార్త వింటే వారు ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తారు.