విక్రమ్‌తో యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారీ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సహజంగానే, విక్రమ్ ఘనవిజయం తర్వాత, దర్శకుడు ఎల్‌సియుని (LCU) ఎలా ముందుకు తీసుకువెళతారనే దాని పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తమిళ సినిమా నంబర్ వన్ హీరో అయిన విజయ్ తో యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’ కోసం జతకట్టారు.
కాగా ఈ కాంబో వల్ల సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తూ ఇప్పటికే రికార్డులు సృష్టించింది. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు భారీ ఆఫర్లను పొందడం ప్రారంభించారు. ఇటీవలే విడుదల అయిన ఫస్ట్ లుక్ సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేయడంతో విజయ్ అభిమానులు ఈ సినిమా విక్రమ్ స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నారు.
కాగా ఈ లియో సినిమాకి ఓవర్సీస్ ప్రాంతాలలో.. డిస్ట్రిబ్యూటర్లు 70 – 75 కోట్లకి స్థాయిలో బిజినెస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది భారీ సంఖ్య అనే చెప్పాలి. తమిళ సినిమాలకి మార్కెట్ ఓవర్సీస్‌లో విపరీతంగా ఉంది మరియు అన్నీ సవ్యంగా సాగితే తమిళ సినిమాలు $15 మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేయగలవు. ఇటీవల, మణిరత్నం యొక్క PS1 $ 20 మిలియన్లకు పైగా వసూలు చేసింది కాబట్టి ఈ సినిమాకి మంచి టాక్ వస్తే రికార్డు స్థాయిలో వసూళ్లు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియోలో విజయ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, సంజయ్ దత్, మాథ్యూ థామస్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ మరియు శాండీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.