టాలీవుడ్ యంగ్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పై యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ చేస్తోన్న సంగతి తెల్సిందే. ఇక ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ తో విజయ్ ఆశించిన స్థాయి సక్సెస్ అయితే సొంతం చేసుకోలేకపోయారు విజయ్.
అంతకముందు వచ్చిన ఖుషి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నప్పటికీ విజయ్ నుండి అయన ఫ్యాన్స్ మంచి యాక్షన్ మూవీ కోరుకుంటున్నారు. నిజానికి యువతలో విశేషమైన క్రేజ్ కలిగిన విజయ్ దేవరకొండ అటువంటి యాక్షన్ కాన్సెప్ట్ తో మంచి మూవీ చేస్తే బ్లాక్ బస్టర్ ఖాయం అనేది తెల్సిందే.
ఇక ప్రస్తుతం గౌతమ్ తో చేస్తున్న యాక్షన్ మూవీలో విజయ్ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుండో తన నుండి కోరుతున్న అన్ని అంశాలు పొందుపరిచి టీమ్ దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తోందని టాలీవుడ్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ నుండి తాజాగా రిలీజ్ అయిన విజయ్ పవర్ఫుల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే ఈసారి రౌడీ కొట్టే బాక్సాఫీస్ దెబ్బ మాములుగా ఉండదని తెలుస్తోంది. కాగా ఈ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.