యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీకి కింగ్‌డమ్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. విజయ్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈమూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం సమకూర్చారు.
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు రిలీజ్ చేసారు మేకర్స్. ఈ టీజర్ లో ముఖ్యంగా విజయ్ దేవరకొండ పవర్ఫుల్ లుక్ తో పాటు అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలాబాగున్నాయి. అలానే విజువల్స్, యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ఒక్కసారిగా మూవీ పై మరింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచింది అని చెప్పవచ్చు.
ప్రస్తుతం కింగ్‌డమ్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ కూడా పవర్ఫుల్ గా ఆకట్టుకుంది. తెలుగులో ఈ టీజర్ కి ఎన్టీఆర్, తమిళ్ లో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఇచ్చారు. కాగా మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మే 30న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.