Homeసినిమా వార్తలుమాల్దీవులలో విహారయాత్ర చేయనున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న

మాల్దీవులలో విహారయాత్ర చేయనున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న

- Advertisement -

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న శుక్రవారం ముంబై విమానాశ్రయంలో కలిసి కనిపించారు. కాగా అంతర్గత వర్గాల నివేదికల ప్రకారం వీరిద్దరూ మాల్దీవులలో విహారయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. ఈ జంట ఇదివరకు ‘గీతా గోవిందం’ మరియు ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ జంటను వారి అభిమానులు ఎంతగానో ఇష్ట పడతారు. అయితే ముంబై విమానాశ్రయంలో ఇరువురు తారలు మీడియాతో సంభాషించకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోయారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్‌ చేస్తున్నారు అంటూ ఇదివరకే బలమైన పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్‌లను ఎక్కడ కూడా వీరిద్దరూ ధృవీకరించలేదు. కొత్త సంవత్సర వేడుకలను కలిసి జరుపుకోవడం కోసం, అలాగే ముంబైలో ఒక చోట కలిసి భోజనం చేయడం వంటి వివిధ కారణాల వల్ల ఈ జంట తరచుగా వార్తల్లో నిలిచారు.

ఇక తాజాగా ఈ మాల్దీవుల పర్యటనతో, పుకార్లు మరింత బలపడ్డాయి. అయితే ఈ తాజా పరిణామం పై అభిమానులు మాత్రం చాలా సంతోషిస్తున్నారు. విజయ్ – రష్మికల జోడీ సినిమాల్లోనే కాకుండా బయట కూడా నిజం అవ్వాలని వారు ఎల్లప్పుడూ ఆశించారు. విజయ్ దేవరకొండ ఇటీవలే లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

READ  లైగర్ సినిమా OTT రిలీజ్ డిటైల్స్

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ, ఆయన తదుపరి చేసే హిందీ ప్రాజెక్ట్ చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఖుషీ సినిమా త్వరలోనే రాబోతుంది. ఆ తరువాత విజయ్ సుకుమార్‌తో కూడా ఒక ప్రాజెక్ట్ ను సిద్ధం చేసి ఉంచారు.

రష్మిక తాజాగా బాలీవుడ్ లెజెండ్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై సినిమాతో తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అంతే కాకుండా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను అనే మరో పెద్ద ప్రాజెక్ట్‌ లో కూడా నటిస్తుండటం విశేషం. ఇది కాకుండా, రష్మికతో పాటు యావత్ భారతదేశ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప – ది రైజ్‌ సినిమాలో కూడా కనిపించనున్నారు. కాగా ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  మహేష్ - త్రివిక్రమ్ ల SSMB28 షూటింగ్ రెండవ షెడ్యూల్ వివరాలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories