Homeసినిమా వార్తలుమాట మీద నిలబడ్డ విజయ్ దేవరకొండ

మాట మీద నిలబడ్డ విజయ్ దేవరకొండ

- Advertisement -

విజయ్ దేవరకొండ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ యంగ్ అండ్ వైబ్రెంట్ హీరో తనదైన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ తో.. మరియు స్క్రీన్‌పై చక్కని నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.

అయితే ఆయన సక్సెస్ కేవలం ఒక రోజులో వచ్చేసింది అని కొందరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. విజయ్ దేవరకొండ ఈరోజు ఉన్న స్థానంలో ఉండేందుకు చాలా కష్టపడ్డారు.తన కెరీర్ ప్రారంభంలో నువ్విలా మరియు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలలో చిన్న పాత్రలలో కనిపించారు. నాగ్ అశ్విన్, నానిల ఎవడే సుబ్రమణ్యం సినిమా అతనికి ఇండస్ట్రీలో చోటు దక్కేలా చేసింది. ఈ చిత్రం విజయం తర్వాత, అతను తరుణ్ భాస్కర్ యొక్క పెళ్లి చూపులుతో ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసారు, ఇది అనేక అవార్డులతో పాటు గొప్ప ప్రశంసలను కూడా గెలుచుకుంది.

ఆ తర్వాత, విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సంచలనం రేపింది. ఆ సినిమా విజయ్ ను స్టార్ డం వైపు నడిపించింది. ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా వంటి పలు హిట్‌లను అందించారు. అలాగే డియర్ కామ్రేడ్ మరియు వరల్డ్ ఫేమస్ లవర్ వంటి అట్టర్ ఫ్లాప్ లను కూడా ఇచ్చారు. ఇక తాజాగా భారీ హైప్ తో వచ్చిన లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచింది.

READ  లూసిఫర్ తో పోలిస్తే గాడ్ ఫాదర్ ను చాలా మెరుగుపరిచాం - మెగాస్టార్ చిరంజీవి

లైగర్ ప్రమోషన్స్ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా ఫ్లాప్ అయితే మళ్లీ లవ్ స్టోరీల్లోకి వస్తానని చెప్పారు. కాగా తాను చెప్పిన మాటకు నిజంగా కట్టుబడి ఉన్నారని, మరియు రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను మాత్రమే చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారని అంతర్గత వర్గాల ద్వారా సమాచారం అందుతొంది.

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు విజయ్. ఇక దీని తర్వాత విజయ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో చేతులు కలపనున్నారు, విజయ్ లైనప్‌లో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా ఉన్నారని అంటున్నారు.

యూత్ మరియు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నందున ప్రస్తుతం యువ దర్శకులందరూ విజయ్‌ దేవరకొండతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండకు ఎంచుకోవడానికి వీలుగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మరియు వాటిలోంచి విజయ్ చాలా జాగర్తగా ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు.

విజయ్ దేవరకొండ మళ్ళీ విజయాల బాట పట్టి వరుస సూపర్‌హిట్‌లతో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని కోరుకుందాం.

READ  కమ్ బ్యాక్ హిట్ కోసం కొడుకుతో సినిమా తీయనున్న పూరి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories