కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విడాముయార్చి. తెలుగు లో పట్టుదల టైటిల్ తో ఈ మూవీ డబ్ చేయబడింది.
ఇక మంచి అంచనాలతో నిన్న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈమూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అజిత్ వంటి స్టార్ తో అంతగా ఆకట్టుకోని కథ కథనాలతో దర్శకుడు మగిళ్ తెరకెక్కించిన ఈ మూవీ పై కొందరు విమర్శలు చేస్తున్నారు.
మొత్తంగా ఫస్ట్ డే బాగానే ఓపెనింగ్ రాబట్టిన ఈ మూవీ రెండో రోజు బాగా డ్రాప్ అయింది. ఇక డే 1 లెక్కలు చూస్తే, తమిళనాడులో రూ. 28-29 కోట్లు, కర్ణాటక రూ. 4.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 2.5 కోట్లు, ఆ విధంగా మొత్తం ఇండియా వైడ్ గా రూ. 36 కోట్లు రాబట్టింది.
అలానే అటు ఓవర్సీస్ లో రూ. 15 కోట్లు రాబట్టి ఓవరాల్ వరల్డ్ వైడ్ డే 1 రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి అజిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అర్జున్ సర్జా, రెజీనా కీలక పాత్రల్లో కనిపించిన ఈ మూవీని భారీ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించగా అనిరుద్ సంగీతం సమకూర్చారు.