ఇటీవల బాబీ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్ ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి.
బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసిన డాకు మహారాజ్ మూవీ ఆ తరువాత నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చి అతితక్కువ సమయంలోనే భారీ వ్యూస్ తో టాప్ పొజీషన్ లో నిలిచింది. కాగా ఇటీవల బాక్సాఫిస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయిన అజిత్ కుమార్ మూవీ విడాముయార్చి. ఈ మూవీని యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరకెక్కించగా త్రిష హీరోయిన్ గా నటించారు.
ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన విడాముయార్చి మూవీ సెకండ్ హాఫ్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా బాక్సాఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినా ఈ మూవీ నిన్నటి నుండి నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది.
అక్కడి నుండి వెను వెంటనే ఈ మూవీ అత్యధిక వ్యూస్ తో ట్రెండింగ్ లోకి వచ్చి టాప్ పొజిషన్ లో నిలిచింది. ముఖ్యంగా అజిత్ కుమార్ కు అన్ని భాషల ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడంతో ఈ మూవీ వేగంగా అందరిని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ విధంగా హిట్ అయిన డాకు మహారాజ్ ని విడాముయార్చి అధిగమించి దూసుకెళుతోంది.