తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో దూసుకుపోతున్న ప్రతిభావంతుడు అయిన యువ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవులే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా దర్శకత్వం వహించారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ తాజాగా ఓ సర్‌ప్రైజ్ గ్లింప్స్ వదిలింది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఆ విషయం చిత్ర బృందం టీజర్ ద్వారా తెలిపే వరకూ ఎవరికీ తెలియదు. అందుకే చిత్ర యూనిట్ విడుదల చేసిన సర్‌ప్రైజ్ గ్లింప్స్‌తో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. ఇక వెంకీ మామా అభిమానులు కూడా కూడా ఇది ఒక ప్రియమైన సర్‌ప్రైజ్ లాగా భావించారు.
కాగా విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో కీలకమైన అతిథి పాత్రను పోషించడంతో, ఈ చిత్రం ప్రేక్షకులలో చాలా మంచి బజ్‌ను సృష్టించింది, దాంతో ఈ సినిమా బిజినెస్ కు ఆ క్రేజ్ చాలా ఉపయోగపడింది. ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ నుండి చక్కని ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాక నాన్ థియేట్రికల్ రైట్స్‌కి కూడా చాలా మంచి డిమాండ్ ఉందని అంటున్నారు. కాగా ఓరి దేవుడా చిత్రం తాలూకు డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు విక్రయించింది. ఈ మధ్య ప్రైమ్ తెలుగు సినిమాల హక్కులను కొనడం కాస్త తగ్గించింది. ఈ సినిమాతో మళ్ళీ మార్కెట్ లోకి దూసుకు వస్తుందేమో చూడాలి.
తెలుగులో విక్టరీ వెంకటేష్ చేస్తున్న పాత్రను తమిళంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పోషించారు. ఓరి దేవుడా సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర నిర్మాతలు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.