తాజాగా కోలీవుడ్ నటుడు సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వేట్టయాన్ నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇటీవల సూర్య హీరోగా రూపొందిన జై భీం మూవీతో మంచి విజయం సొంతం చేసుకున్న టీజె జ్ఞానవేల్ రూపొందించిన ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దూషార విజయన్, ఫాహద్ ఫాసిల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలని పోషించారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న వేట్టయాన్ మూవీ యొక్క రివ్యూ ఇప్పుడు చూద్దాం.
నిజానికి వేట్టయాన్ మూవీ జైలర్ మాదిరి కంటెంట్ మూవీ కాదని టి.జె. జ్ఞానవేల్ చాలాసార్లు చెప్పారు. దానికి తోడు కమర్షియల్ ఎలిమెంట్స్ హ్యాండిల్ చేయడం కూడా దర్శకుడి స్ట్రాంగ్ పాయింట్ కాదని తెలుస్తోంది. దాన్ని బట్టి కమర్షియల్ ఎలెమెంట్స్ ని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మొత్తం కథ అంతా కూడా క్యారెక్టరైజేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అయితే కంటెంట్ ప్రేక్షకులను తగినంతగా ఎంగేజ్ చేయదు.
సూపర్‌స్టార్ మరియు బిగ్ బి వంటి పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి వారి ఫ్యాన్స్ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఎలివేషన్‌లు ఉన్నాయి, కాగా అవి మాత్రమే ఆడియన్స్ ని ఎక్కువ ఆకట్టుకుంటాయి. దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ రియాలిటీ మరియు సినిమాటిక్ ఎలిమెంట్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో తడబడడం మైనస్ గా మారింది.
కాగా వేట్టయాన్ అనేది రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ ల భావజాలాల యొక్క ఘర్షణతో సాగె సందేశాత్మక మూవీ. ఇక అంతకుమించి ఫహద్ ఫాసిల్ యొక్క వినోదాత్మక భాగం ఆకట్టుకున్నప్పటికీ మిగతా భాగాన్ని ఆకట్టుకునే తెరకెక్కించడంలో దర్శకుడు టీజె జ్ఞానవేల్ విఫలమయ్యారు. ఎన్‌కౌంటర్ హత్యలు మరియు వాటి మానవ ప్రభావాన్ని చూపించే అంశం బాగుంది. మొత్తంగా పోలీసు వ్యవస్థ మరియు పోలీసుల యొక్క గొప్పతనాన్ని తెలిపే సందేశంతో పాటు వారిని మానవాతీత వ్యక్తులుగా కీర్తించడం ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్ :
రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్
ఫహాద్ ఫాసిల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్
ప్రథమార్ధం
అనిరుధ్ బిజీఎం & మనసిలాయో సాంగ్
ఇంటర్వెల్ బ్లాక్
మైనస్ పాయింట్స్ :
ద్వితీయార్ధం
రానా క్యారెక్టరైజేషన్
ద్వితీయార్ధంలో ఊహించదగిన కథనం
భావోద్వేగాలు లేకపోవడం
సినిమా రన్‌టైమ్
తీర్పు:
మొత్తంగా వేట్టయాన్ మూవీ సమీక్షను క్లుప్తంగా చెప్పాలంటే, మీరు హార్డ్ హిట్టింగ్ సోషల్ డ్రామాలు అలానే సందేశాత్మక సినిమాల ఇష్టపడితే ఇది నచుతుంది. కానీ మీరు రజనీ, అమితాబ్, ఫహద్ మరియు రానా ల బ్లాస్టింగ్ అంశాలు చూడాలనే ఆశతో వెళ్తే మాత్రం మీరు నిరాశ చెందుతారు.
రేటింగ్: 2.75 / 5