కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టిజి జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వేట్టయాన్. ది హంటర్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, తాజాగా వేట్టయాన్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోగా దీనికి యు / ఏ సర్టిఫికెట్ అని అందించారు సెన్సార్ బోర్డు వారు. అలానే ఈ మూవీ 163 నిముషాలు అనగా 2 గం. 43 ని.లు రన్ టైం పాటు సాగనుంది.
ఈ మూవీలో రజినీకాంత్ ఒక స్పెషల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్నారు. ఒక బాధితురాలికి న్యాయం చేయడం కోసం వేట సాగించి పలువురు నేరస్థునల్ని వేటాడే పాత్రలో రజిని పెరఫార్మన్స్ అదిరిపోనుందని కోలీవడ్ వర్గాల టాక్. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన వేట్టయాన్ మూవీ రిలీజ్ అనంతరం ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.