సినిమా: వీరసింహారెడ్డి
రేటింగ్: 2.75/5
తారాగణం: బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు.
డైరెక్టర్: గోపీచంద్ మలినేని
నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ: 12 జనవరి 2022
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం అభిమానుల అంతులేని ఉత్సాహం మధ్య ఎట్టకేలకు వెండి తెర పైకి వచ్చింది. గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్ టైనర్ లో అఖండ, క్రాక్ వంటి భారీ విజయాలతో బాలయ్య, దర్శకుడు కెరీర్ లో మంచి హైప్ మీద ఉన్నారు. ఈ చిత్రం యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ మరియు ఓవర్ సీస్ ప్రీ-సేల్స్ ప్రోత్సాహకరమైన సంకేతాలను ఇచ్చాయి మరి ఈ చిత్రం ఆ హైప్ ను నిలబెట్టుకోగలిగిందో లేదో చూద్దాం.
కథ:
పులిచెర్ల ప్రాంతాన్ని పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా వీరసింహారెడ్డి (బాలకృష్ణ) పరిపాలిస్తూ ఉంటాడు. అతని కుమారుడు జై సింహా రెడ్డి (బాలకృష్ణ) తండ్రికి దూరంగా ఇస్తాంబుల్ లో ఉంటాడు. వీరసింహారెడ్డికి, అతని కుమారుడికి దూరం ఎందుకు ఉంది, భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయి అనేది మిగిలిన కథ.
నటీనటులు:
బాలకృష్ణ తన జీవితంలో లెక్కలేనన్ని సార్లు ఇలాంటి పాత్రను చేశారు. వీరసింహారెడ్డిగా ఆయన బిగ్గరగా గర్జించడం, ఓల్డ్ ఏజ్ లుక్ మరియు క్యారెక్టరైజేషన్, పెర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాను ఆయన పూర్తిగా తన భుజాల పై వేసుకున్నారు. హీరో డామినేషన్ పూర్తిగా ఉన్న ఈ సినిమాలో శృతి హాసన్ కొత్తగా చేయడానికి ఏమీ లేదు మరియు ఫస్ట్ హాఫ్ లో మరియు తరువాత కొన్ని పాటల్లో ఆమె అలరిస్తారు. భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ గొప్పగా నటించి పాత్రలో ఒదిగిపోయారు. ప్రతినాయకుడిగా దునియా విజయ్ బాలకృష్ణని ధీటుగా ఎదుర్కోవటానికి తన పాత్రలో తగిన క్రూరత్వం లోపించి తెర పై మసకబారారు. మంచి సంఘర్షణ, బలమైన ప్రతినాయక పాత్ర ఉండుంటే సినిమాకు బాగా హెల్ప్ అయ్యేవి.
విశ్లేషణ:
వీరసింహారెడ్డి ఒక స్టాండర్డ్ టెంప్లెట్ ఎంటర్టైనర్, పంచ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, పొలిటికల్ మోనోలాగ్స్ అన్నీ బాలయ్య హార్డ్ కోర్ అభిమానులను మెప్పించేలా ఉన్నాయి. ఈ చిత్రం యాక్షన్ సీక్వెన్స్ ల సమాహారంగా చెప్పుకోవచ్చు, అయితే అవి అన్ని అద్భుతంగా డిజైన్ చేయబడినప్పటికీ ఒకదాని తరువాత ఒకటి వరుసగా రావడం దగ్గరే సినిమా యొక్క ప్రధాన సమస్య మొదలవుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమా పై ఆసక్తి కోల్పోయేలా చేసి మరింత కనెక్ట్ అయ్యేలా చేయడంలో కథనం విఫలమైంది.
ప్లస్ పాయింట్స్:
- బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, క్యారెక్టరైజేషన్
- కొన్ని యాక్షన్ బ్లాక్ లు
- తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- బాలకృష్ణ, వరలక్ష్మి శరత్ కుమార్ ల ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- బాలకృష్ణ, శృతి హాసన్ ల లవ్ ట్రాక్
- రొటీన్ కథ, డైలాగులు
- బలహీనమైన విలన్ క్యారెక్టరైజేషన్
తీర్పు:
వీరసింహారెడ్డి అనేది బాలయ్యకు స్ట్రాంగ్ జోన్ లో తీసిన సినిమా కావడంతో ఆయన ఆ పాత్ర ద్వారా మెప్పిస్తారు. అయితే కేవలంఆయన అభిమానులకు నచ్చేలా మాత్రమే కాకుండా మంచి స్క్రీన్ ప్లే ఏర్పాటు చేయడం పై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. మొత్తం మీద ఈ సినిమా తగినన్ని మాస్ మూమెంట్స్, విజిల్ వేసే సన్నివేశాలతో ఉండి బాలకృష్ణ వన్ మ్యాన్ షోలా ఉంటుంది.