బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి పండుగ రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి రన్ ను కొనసాగించడంలో విఫలమైంది మరియు వారాంతంలో కూడా ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు వీకెండ్ తర్వాత ఈ సినిమా పూర్తిగా క్రాష్ అవడంతో నిన్న చాలా థియేటర్లలో డెఫిషిట్ లు నమోదయ్యాయి.
కలెక్షన్ల పతనం చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రన్ దాదాపుగా ముగిసిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఓపెనింగ్ రోజు కలెక్షన్లు భారీగా రావడం, అటు పైన పండగ రోజుల సెలవులు కూడా సినిమాకు హెల్ప్ అయ్యాయి.
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈ సంక్రాంతికి విడుదలై మిక్స్ డ్ రివ్యూలు, పబ్లిక్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ చిత్రం ముఖ్యంగా ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టి అద్భుతమైన ఓపెనింగ్ వీకెండ్ ను రాబట్టింది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల అయింది.
మొదటి వారం తర్వాత సినిమా స్లో అవడంతో అంతటా ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమా వాల్తేరు వీరయ్యతో పోలిస్తే ఈ బాలయ్య సినిమా ఇప్పుడు చాలా నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినప్పటికీ థియేట్రికల్ రన్ మాత్రం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద 11 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.