తెలుగు సినిమా పరిశ్రమలో అనతికాలంలోనే అభిరుచి గల నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ఎందుకో తెలీదు కానీ చిన్న హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలతో కూడా ఆయన పెద్దగా సక్సెస్‌లు అందుకోవడం లేదు. కానీ పరాజయాలు మరియు విజయాలు అనేవి సినిమా పరిశ్రమలో సహజం. అందుకే దిల్ రాజు కంగారు పడకుండా మళ్లీ సరైన విజయం సాధించి విజయపథంలోకి అడుగు వేయాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ భారీ బడ్జెట్ ద్విభాషా చిత్రాన్ని నిర్వహిస్తున్నారు, తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వరిసు (తెలుగులో వారసుడు) చిత్రం తమిళం మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో తెరపైకి రాబోతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం హీరో విజయ్ కి దాదాపు 100 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్లు వినిపిస్తోంది.
ఈ పుకార్లను పక్కన పెడితే, ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను సన్ టీవీ కైవసం చేసుకోగా, అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను పొందింది. టీ-సిరీస్ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఈ ఒప్పందాల వల్ల నిర్మాత దిల్ రాజు 115 కోట్ల రూపాయలను రాబట్టారని సమాచారం. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 150 కోట్ల వరకూ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
వరిసు చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది, అక్టోబర్ 29 నాటికి షూటింగ్ పూర్తి అవుతుందని, దీని తర్వాత వరుసగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అంతర్గత వర్గాల నివేదికలను ప్రకారం, ఈ సినిమా ప్రచార నిమిత్తం దిల్ రాజు దుబాయ్‌లో భారీ ప్రమోషనల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారట. మరియు సూపర్ స్టార్ విజయ్ ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారట. ఈ సినిమాకు సంబంధించి ఒక్క పాట, కాస్తంత ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదలవుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కి హీరోయిన్‌గా రష్మిక మందన్నను ఎంపిక చేశారు. ఇక ఫామ్ లో ఉన్న ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పాన్-ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే విజయ్ మొట్ట మొదటిసారి తెలుగులో సినిమా చేయనుండటమే.