పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఇటీవల హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నిర్మాతలు ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఎడిటింగ్ పనులు ఈ రోజు ప్రారంభమయ్యాయని వారు ప్రకటించారు. కాగా టెక్నికల్ వర్క్ ప్రారంభానికి ముందు లాంఛనంగా పూజా కార్యక్రమం జరిగింది.
ముందుగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా గబ్బర్ సింగ్.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు పెద్ద కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఇక దశాబ్దం తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అభిమానుల ఆనందానికి మరింత సంతోషాన్ని చేకూర్చేలా గబ్బర్ సింగ్ విడుదల తేదీ అయిన మే 11న ఓ గ్లింప్స్ ను విడుదల చేయాలని ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మాస్ రోల్ లో ప్రెజెంట్ చేస్తూ అభిమానులను అలరించే ఎంటర్ టైనింగ్ అండ్ బ్లాస్టింగ్ గ్లింప్స్ ను తెరకెక్కించే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా తమకు ఎంతో ప్రత్యేకమైన సందర్భానికి సంబంధించిన ఈ బ్లాస్టింగ్ అప్డేట్ వింటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
విజయ్ నటించిన తేరికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల రొమాన్స్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ, ఇతర సమాచారాన్ని త్వరలోనే ప్రకటిస్తారు.