టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తాజాగా మాస్ యాక్షన్ మూవీ NBK 109. ఈ మూవీపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ యొక్క రిలీజ్ పై త్వరలో అనౌన్స్ మెంట్ రానుంది .ఇక మరోవైపు కొన్నాళ్లుగా బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహాలో వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్.
ఈ క్రేజీ ఎంటర్టైనింగ్ షో ఇప్పటికే సక్సెస్ఫుల్ గా మూడు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఇక తాజగా అన్ స్టాపబుల్ 4 షో యొక్క ట్రైలర్, టీజర్ అందరినీ ఆకట్టుకుని ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ సీజన్ 4 లోని ఫస్ట్ ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిధిగా విచ్చేసారు.
ఇక అటు బావ బావమరుదులైన బాలకృష్ణ, చంద్రబాబు ల మధ్య జరిగిన ఈ ఫస్ట్ ఎపిసోడ్ యొక్క ప్రోమో ఇప్పటికే అందరినీ ఆకట్టుకోగా కొద్దిసేపటి క్రితం ఫుల్ ఎపిసోడ్ యొక్క వీడియోని కొద్దిసేపటి క్రితం ఆహా వారు టెలికాస్ట్ చేసారు. అటు సరదా సంభాషణలతో పాటు అటు పలు పొలిటికల్ ప్రశ్నల సమాహారంగా ఈ ఎపిసోడ్ 1 సాగనుందని తాజాగా రిలీజ్ అయిన ప్రోమోని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. మరి అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 ఎంతమేర రేటింగ్స్, వ్యూస్ అందుకుంటుందో చూడాలి.