కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి ఇంకా విడుదల తేదీని ప్రకటించని ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఇటీవలే కొందరు మీడియా, ఇండస్ట్రీ వర్గాల కోసం చిత్ర యూనిట్ స్పెషల్ షో వేయగా ఆ షో నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ అందరూ తమ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అంటున్నారు. నేచురల్ హ్యూమన్ ఎమోషన్స్ తో నిండిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని ఖచ్చితంగా నచ్చుతుందని స్పెషల్ షో నుంచి టాక్ వినిపిస్తోంది.
కుటుంబం గురించి, తల్లిదండ్రులు, పిల్లల మధ్య జనరేషన్ గ్యాప్ గురించి, మన సామాజిక నిర్మాణంలో నేటి సున్నితత్వాలు, వైఖరులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి. విజయం కోసం మనం మన ఆత్మలను ఎలా కోల్పోతాం అనే అంశాలను ఈ చిత్రం తెలియజేస్తుందని దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
మొత్తంగా ఇళయరాజా అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలతో ఒక ఎంగేజింగ్ ఫ్యామిలీ సినిమాగా ఉంటుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో సినీ నటుల జీవితాలకు నివాళిగా మూడున్నర నిమిషాల పాటు ఉండే తెలుగు షాయరీని మెగాస్టార్ చిరంజీవి తన గళం ద్వారా వినిపించారు.
ప్రముఖ ఆర్టిస్ట్ మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన మరాఠీ బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ కు అధికారిక రీమేక్ గా రంగ మార్తాండ సినిమా తెరకెక్కింది. నానా పటేకర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ హృదయానికి హత్తుకునే డ్రామా.. నటన నుండి రిటైర్ అయినా నాటకరంగం యొక్క మధుర జ్ఞాపకాలను మరచిపోలేని ఒక రంగస్థల నటుడి విషాద కుటుంబ జీవితాన్ని చూపిస్తుంది.