Homeసినిమా వార్తలుTwo Beautiful Heroines in Vijay 69 '​తలపతి 69' : విజయ్ కి జోడీగా...

Two Beautiful Heroines in Vijay 69 ‘​తలపతి 69’ : విజయ్ కి జోడీగా ఇద్దరు అందాల భామలు ?

- Advertisement -

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ హీరోగా ఇటీవల వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఈ మూవీలో స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. 

మంచి అంచనాలతో ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యావరేజ్ విజయం సొంతం చేసుకుంది. అయితే దీని అనంతరం విజయ్ కెరీర్ ఆఖరి మూవీ అయిన 69వ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించనుండగా యువ దర్శకుడు హెచ్ వినోద్ దీనిని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించనున్నారు. 

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో హీరోయిన్స్ గా యువ అందాల భామలు పూజా హెగ్డే, మామితా బైజు హీరోయిన్స్ గా ఎంపికైనట్లు లేటెస్ట్ కోలీవుడ్ టాక్. త్వరలో వీరి ఎంపిక విషయమై టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

READ  Game Changer Second Song Update 'గేమ్ ఛేంజర్' : అఫీషియల్ సెకండ్ సాంగ్ అప్ డేట్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories