తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు అనేక బెంచ్ మార్క్ సినిమాలు సరికొత్త కలెక్షన్ ఒరవడిని సృష్టించాయి. అయితే ఇటీవల వచ్చిన భారీ పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి 1, బాహుబలి 2 రిలీజ్ తరువాత తెలుగుతో పాటు ఏకంగా సౌత్ లోనే సీనిమాల రేంజ్, కలెక్షన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయాయి.
ఇక ఆ రెండు మూవీస్ అనంతరం ఇటీవల రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో టాప్ 5 గ్రాసింగ్ తెలుగు మూవీస్ లిస్ట్ లో ప్రభాస్, రాజమౌళి ల సినిమాలు మాత్రమే నిలిచాయి. ఆ విధంగా తెలుగులో ఆర్ఆర్ఆర్ మూవీ రూ. 365 కోట్ల గ్రాస్ తో ప్రథమ స్థానంలో నిలవగా రెండవ స్థానంలో బాబుబలి 2 రూ. 310 కోట్లు, మూడవ స్థానంలో సలార్ రూ. 213 కోట్లు, నాలుగవ స్థానంలో కల్కి 2898 ఏడి రూ. 200 కోట్లు (స్టిల్ రన్నింగ్), ఇక బాహుబలి 1 రూ. 184.34 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచింది.
అయితే వీటిలో కల్కి ఫైనల్ గా ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ విధంగా టాలీవుడ్ టాప్ 5 గ్రాసింగ్ మూవీస్ లిస్ట్ లో రాజమౌళివి మూడు సినిమాలు ఉండగా టాప్ 5లో నిలిచిన నాలుగు సినిమాలు కలిగిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలవడం గమనార్హం.