Homeసినిమా వార్తలుషూటింగ్ ల బంద్ తో నిర్మాతల సమస్యలు తీరిపోతాయా ?

షూటింగ్ ల బంద్ తో నిర్మాతల సమస్యలు తీరిపోతాయా ?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ రేపటి నుంచి అన్ని సినిమాల తాలూకు షూటింగ్ లని నిలిపి వేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చింది. నిర్మాతల గిల్డ్ ప్రకటించిన బంద్ కు మొదటి నుంచి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వ్యతిరేకించినా, మొత్తానికి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. గిల్డ్ నిర్ణయానికి అందరూ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దీంతో నిర్మాతలు అందరూ కలిసి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి సంపూర్ణంగా షూటింగ్ ల బంద్ ని పాటిస్తున్నామంటూ ఆదివారం సంచలన ప్రకటన చేసింది.

ఇలాంటి ఒక నిర్ణయం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంత వరకూ ఇండస్ట్రీలో వున్న 25 శాఖల్లో ఏదో ఒక శాఖ లేదా 24 శాఖలకు ప్రాతినిధ్యం వహించే ఫేడరేషన్ షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చేది. లేదా జూనియర్ ఆర్టిస్ట్ లు షూటింగ్ లలో పాల్గొనము అంటూ ధర్నాకు దిగేవారు. కానీ తొలి సారి తెలుగు సినీ చరిత్రలో నిర్మాతలే స్వయంగా రంగంలోకి దిగి షూటింగ్ లని ఆపేయడం అనేది ప్రప్రథమంగా జరుగుతోంది. ఇంతకీ నిర్మాతల డిమాండ్లేంటీ? అవి షూటింగ్ లను ఆపి వేయడంతో నెరవేరతాయా? ..బంద్ తో వారు ఎదురుకుంటున్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం అందరిలోనూ ఉన్నాయి.

నిన్నటి వరకు బంద్ విషయంలో గిల్డేతర నిర్మాతలు వ్యతిరేకతని వ్యక్తం చేశారు. అయితే ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో మాత్రం అందరూ గిల్డ్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా నమోదు చేయడంతో ఆగస్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ నిర్ణయానికి అడ్డు లేకుండా పోయింది. ఇంతకీ నిర్మాతల ప్రధాన డిమాండ్ లు ఏంటి అన్నది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.

READ  ఆ విషయంలో పరశురాందే తప్పు అంటున్న మహేష్ ఫ్యాన్స్

ఈ విషయం పై అగ్ర నిర్మాత దిల్ రాజు కొంత వరకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కోవిడ్ తరువాత పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో మరియు ఓటీటీ, టికెట్ రేట్లు ఇలా చాలా మార్పులు వచ్చాయి. అంతే కాకుండా షూటింగ్లలో చాలా వేస్టేజీ జరుగుతోంది. ఈ సమస్యలపై ప్రధానంగా చర్చించడానికే షూటింగ్ లను ఆపేస్తున్నాము. వీటన్నిటికీ పరిష్కారాలు దొరికిన తర్వాతే మళ్లీ షూటింగ్ లు తిరిగి ప్రారంభిస్తాము అని దిల్ రాజు తెలిపారు..

నిర్మాతలు చెబుతున్న ప్రధాన సమస్య వేస్టేజీ.. అయితే దాన్ని ఎలా కట్టడి చేస్తారన్న దాంట్లో ఎవరికీ ఒక స్పష్టత లేదనే చెప్పాలి. స్టార్ హీరోలకి సంబంధిన స్టాఫ్, లేదా స్టార్ హీరోయిన్ ల స్టాఫ్ లకు అదనంగా చేసే ఖర్చులు ఉంటూనే ఉంటాయి. దానికి కారణం ఫలానా సినిమాకు ఫలానా స్టార్ కావాలి అని నిర్మాతలే ఎంచుకుంటారు కాబట్టి వారి డిమాండ్ లను ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇక స్టార్ హీరోల పారితోషికాల పరిస్థితి కూడా అంతే. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు తమ పారితోషికం నిర్ణయించుకుంటారు.

ఇక ఈ మధ్య ప్రతి దానికి ఓటీటీ సంస్థలను కారణంగా చూపడం నిర్మాతలకు ఒక అలవాటుగా మారింది. కరోనా దాడి సమయంలో అసలు దిక్కు తోచని పరిస్తితిలో నిర్మాతలకు చక్కని లాభసాటి వ్యాపారం వచ్చేలా చేసింది ఓటిటి సంస్థలే. ఆ విషయాన్ని నిర్మాతలు మరిచిపోకూడదు.

టికెట్ రేట్లు కూడా ఓ సమస్యగా మారాయని అందు వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని నిర్మాతలు చెప్పడం మాత్రం వింతల్లోకెల్లా అతి పెద్ద వింతగా చెప్పుకోవచ్చు. ఇది నిర్మాతలు స్వయంగా తలకెత్తుకున్న సమస్య. భారీ చిత్రాలు రిలీజ్ అయిన సందర్భంలో టికెట్ రేట్లని భారీగా పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వాలు కల్పిస్తే. వారితో జీవోలు రిలీజ్ చేయించుకుని చిన్న పెద్దా తేడా లేకుండా ఇష్టానుసారం ప్రతి సినిమాకీ అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచేసుకుని ఇప్పుడు అదే టికెట్ రేట్ల కారణంగా సమస్యలు వచ్చాయని అంటున్నారు. అసలు సరైన ఆలోచన గానీ అవగాహన గానీ లేకుండా నిర్ణయం తీసుకుంది ఎవరు? మీకు మీరే అన్నీ పెంచేసుకుని మళ్లీ ఇప్పుడు అయ్యో సినిమాలు ఆడట్లేదు అంటూ తల బాదుకుంటే ఎలా అని ప్రేక్షకులు తిరిగి సినీ నిర్మాతలను అడిగినా ఆశ్చర్యం లేదు.

READ  ఓటిటిలో సరికొత్త రికార్డు సృష్టించిన ఆర్ ఆర్ ఆర్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories