ఈ వారం టాలీవుడ్‌లో సినిమాల వెల్లువ కనిపించింది. అల్లు శిరీష్ సినిమా ఊర్వశివో రాక్షసివో, సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా నటించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తో పాటు బొమ్మ బ్లాక్ బస్టర్, తగ్గేదెలే వంటి అనేక చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పటికీ, ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తెచ్చుకున్న సంఖ్యలు ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేవు.
సినిమాలు ప్రేక్షకులకు తెలియకుండానే విడుదలై అలానే ఎలాంటి బజ్ క్రియేట్ చేయకుండానే వెళ్లిపోయాయి. అయితే విడుదలైన అన్ని సినిమాల్లోకి అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో చిత్రానికి మౌత్ టాక్ వచ్చినప్పటికీ, ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్న స్థాయిలో రికవరీ చేయడంలో విఫలమైంది.
మంచి తారాగణం మరియు గీతా ఆర్ట్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ సానుకూల అంశాలన్నీ సినిమాకి ఉపయోగ పడలేదు. పాజిటివ్ రివ్యూలు, టాక్ ఉన్నప్పటికీ వారాంతంలో కేవలం 1.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
ఇక నుంచి బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. అయితే అలా జరిగే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. నవంబర్ సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర మార్కెట్ మందగించిన దశగా పరిగణించబడుతుంది. మరియు ఈ సంవత్సరం కూడా అందుకు మినహాయింపు కాదు.
అయితే, కన్నడ బ్లాక్‌బస్టర్ కాంతార డబ్బింగ్ వెర్షన్ ఈ వారం కొత్త తెలుగు స్ట్రెయిట్ చిత్రాలను అధిగమించి కలెక్షన్లు నమోదు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డ్రీమ్ రన్ నిర్విరామంగా నడుస్తోంది. దీని వల్ల సీజన్ కొంచెం సవాలుగా ఉన్నప్పటికీ ఎలాంటి సమయాల్లో అయినా సరైన కంటెంట్ ప్రేక్షకులను థియేటర్‌లకు తీసుకురాగలదని కాంతార చిత్రం నిరూపిస్తుంది. మరి వచ్చే వారం విడుదలలు ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తాయో లేదో వేచి చూడాలి.
ఇక సమంత నటించిన యశోద చిత్రం వచ్చే వారం విడుదల కానుండగా, ట్రైలర్ ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో తగినంత ఆసక్తిని క్రియేట్ చేసింది. యశోద సినిమాతో మళ్లీ తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి కొనసాగుతుందని.. మరియు ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించాలని, అలాగే ఎగ్జిబిటర్లు మరియు పంపిణీదారుల జేబుల్లో లాభాలను నింపాలని ఆశిద్దాం.