Homeసినిమా వార్తలుBox - Office - జూలై తెలుగు సినిమా రిపోర్ట్

Box – Office – జూలై తెలుగు సినిమా రిపోర్ట్

- Advertisement -

కరోనా ప్యాన్డేమిక్ రాక ముందు తెలుగు సినిమా మార్కెట్ ఎంతో అద్భుతంగా ఉండేది. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా చక్కని వసూళ్లు సాధించేవి. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా తొలి మూడు రోజుల కలెక్షన్లు చాలా బాగుండేవి. వాటి వల్ల సినిమాలు ఫ్లాప్ అయినా నష్టాలు కొంత మేరకే వచ్చేవి. అయితే కరోనా వరుస వేవ్ ల దాడి తరువాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది.


ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ విజయం తరువాత చాలా కాలం తెలుగు నుంచి హిట్ సినిమానే లేదు. F3, సర్కారు వారి పాట చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. చిన్న సినిమాగా వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం పరవాలేదు అనిపించింది.

ఇక జూన్ నెలలో విడుదలైన మేజర్ చిత్రం మాత్రం అందరికీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ ఏడాదిలో ఆర్ ఆర్ ఆర్ తరువాత విజయం సాధించిన ఒకే ఒక్క తెలుగు సినిమా మేజర్ కావడం విశేషం.


ఇక జూలై నెలకు వస్తే తొలి వారం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై, మారుతి దర్శకత్వంలో హీరో గోపీచంద్ మరియు రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన పక్క కమర్షియల్ ఎన్నో అంచనాల మధ్య వచ్చి నిరాశ పరిచింది. ఆ తరువాత వచ్చిన చిన్న సినిమా హ్యాపీ బర్త్ డే కూడా పరాజయం పాలయ్యింది. పక్కా మాస్ బొమ్మగా వచ్చిన రామ్ పోతినేని “ది వారియర్” చిత్రం కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇక నాగ చైతన్య హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన “థ్యాంక్యూ” చిత్రం ఐతే అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది.


ఇక ఈ వారం విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమా అయినా కాస్త రిలీఫ్ ను ఇస్తుంది అనుకున్నారు ట్రేడ్ వర్గాలు. కాస్త తక్కువ అమౌంట్ కే బిజినెస్ జరగడం, మాస్ లో రవితేజకు మంచి ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అవుతుంది అనుకున్నారు. కానీ మొదటి షోలు కాస్త సందడి చేసిన తరువాత చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద చతికిల బడింది.

READ  Box-office Report: జూన్ నెలలో విడుదలైన సినిమాలు

ఇక డబ్బింగ్ సినిమాలైన రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్, సాయి పల్లవి గార్గి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఈ వారం విడుదలైన కన్నడ సినిమా “విక్రాంత్ రోణ” అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విజయం సాధించి అందరికీ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ కు తోడు కాస్త న్యాయమైన టికెట్ రేట్లు ఉంచితే ఖచ్చితంగా సినిమాలు విజయం సాధిస్తాయి అనే పాఠాన్ని మన తెలుగు సినీ నిర్మాతలు మరియు పంపిణీదారులకు చెప్పకనే చెప్పింది “విక్రాంత్ రోణ”.

Follow on Google News Follow on Whatsapp

READ  ది వారియర్ ట్రైలర్ : పక్కా మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్న రామ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories