టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు కొత్త ట్రెండ్ కు తెరతీశారు. యువ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమాను కాపీ కొట్టడం లేదా రీహాష్ చేయడం అనే సరికొత్త ట్రెండ్ ను వారంతా ఫాలో అవుతున్నారు. కొత్తగా మొదలయ్యే తెలుగు సినిమాలన్నీ దాదాపు విక్రమ్ తరహా ఇతివృత్తంతోనే రూపొందుతున్నాయి.
విక్రమ్ స్ర్కీన్ ప్లే సాధారణ కమర్షియల్ సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో ముఖాన్ని ఇంటర్వెల్ చేసే సమయంలో రివీల్ చేయడం అద్భుతంగా వర్కవుట్ కావడంతో పాటు ప్రేక్షకుల్లో ఈ ఎపిసోడ్ కు ఒక ఎపిక్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు కూడా విక్రమ్ ఇంటర్వెల్ సీన్ కు పలు రకాల ఎడిట్స్ తో సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది.
ఇప్పుడు విక్రమ్ స్టైల్ ని టాలీవుడ్ మేకర్స్ కాపీ కొట్టడం మొదలు పెట్టారు. వెంకటేష్, శైలేష్ కొలనుల తాజా చిత్రం సైంధవ్ విక్రమ్ తరహాలో ఉంటుందని, పవన్ కళ్యాణ్, సుజీత్ ల సినిమా విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. ఈ రెండు సినిమాలకు లీడ్ స్టార్స్ షూటింగ్ డేస్ చాలా తక్కువగా ఉంటాయని, అవుట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ గా తెరకెక్కుతాయని సమాచారం.
స్వతహాగా చిత్ర పరిశ్రమలో ఒక సినిమా భారీ విజయం సాధిస్తే వరుసగా అందరూ ఆ పంథాను అనుసరించడం సర్వసాధారణం. విక్రమ్ స్టైల్ ఉన్న సినిమాలు సమీప భవిష్యత్తులో మరిన్ని వస్తాయి. మరి వీటిలో ఎన్ని సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దళపతి 67’ దసరా పండుగకు కొద్ది రోజుల ముందే అంటే అక్టోబర్ 19, 2023న విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.