తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళితో SSMB 29 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పై అందరిలో భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2027 సమ్మర్లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహేష్ బాబు నటించిన ఒకప్పటి ఫ్యామిలీ యాక్షన్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తాజాగా థియేటర్స్ లో రీ రిలీజ్ అయింది.
ఇక థియేటర్స్ లో మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్ తో కొనసాగుతున్న ఈ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మహేష్. ముఖ్యంగా టాలీవుడ్ రీరిలీజ్ ల పరంగా మహేష్ బాబు సినిమాలు దిగ్విజయంగా మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. అంతకుముందు తొలిసారిగా పోకిరి సినిమాతో టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ని సెట్ చేశారు మహేష్. ఆ సినిమా బాగా కలెక్షన్స్ అందుకుంది.
అనంతరం బిజినెస్ మాన్ ఇటీవల వచ్చిన మురారి కూడా భారీగానే కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా బాగానే కలెక్షన్ రాబట్టినప్పటికీ ఓవరాల్ గా రిలీజెస్ లో మాత్రం తిరుగులేని టాలీవుడ్ కింగ్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విజయంగా కొనసాగుతున్నారు.
ఆ విధంగా అటు న్యూ రిలీజ్ లు మరోవైపు రీ రిలీజ్ లతో కూడా మహేష్ బాబు తన సత్తా చాటుతూ దూయుకెళ్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అతడు రిలీజ్ కానుంది.