Homeసినిమా వార్తలుTitanic: రీరిలీజ్ లో కేవలం 4 రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన...

Titanic: రీరిలీజ్ లో కేవలం 4 రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన టైటానిక్

- Advertisement -

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లాక్ బస్టర్ టైటానిక్ సినిమాని 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 4కె వెర్షన్ తో రీ-రిలీజ్ చేయగా, ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అదిరిపోయాయి. ఈ చిత్రం కేవలం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలన విజయం సాధించింది.

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఐకానిక్ రొమాంటిక్ మూవీ అయిన టైటానిక్ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందే కొత్త ట్రైలర్, పోస్టర్ విడుదల చేయగా భారీ బజ్ వచ్చింది. 1997 లో విడుదలైన టైటానిక్ 1998 లో 14 అకాడమీ అవార్డు నామినేషన్లను కూడా గెలుచుకుంది మరియు వాటిలో 11 అవార్డులను గెలుచుకుంది.

లియోనార్డో డికాప్రియో మరియు కేట్ విన్స్ లెట్ జంటగా నటించిన టైటానిక్ చిత్రం జాక్ డాసన్ (లియోనార్డో డికాప్రియో) మరియు రోజ్ డెవిట్ బుకాటర్ (కేట్ విన్స్ లెట్) కథను మనకు చూపిస్తుంది. చారిత్రాత్మక, కల్పిత అంశాలను మేళవించి, ఇతిహాస ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

READ  Kushi: ఖుషి రీ రిలీజ్ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ - ఆల్ టైమ్ రికార్డ్

కాగా ప్రేక్షకుల వీక్షణ అనుభవాన్ని పెంచడానికి, జేమ్స్ కామెరూన్ యొక్క టైటానిక్ సినిమాని రీమాస్టర్డ్ వెర్షన్ గా అధిక-ఫ్రేమ్-రేటుతో 3D 4K HDR లో విడుదలైంది. 3 గంటల 15 నిమిషాల రన్ టైమ్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 10వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు పారామౌంట్ సోషల్ మీడియా విడుదల చేసిన కొత్త ట్రైలర్ అభిమానులను ఉత్సాహపరిచింది మరియు వారు విజువల్ వండర్ చూడటానికి అత్యంత ఆసక్తితో ఎదురు చూశారు.

Follow on Google News Follow on Whatsapp

READ  NTR30: విలన్ పాత్ర కోసం ఇతర భాష పెద్ద స్టార్లని పరిగణలోకి తీసుకుంటున్న ఎన్టీఆర్ 30 టీమ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories