Homeసినిమా వార్తలుPushpa The Rule: పులితో పోరాడననున్న పుష్పరాజ్?

Pushpa The Rule: పులితో పోరాడననున్న పుష్పరాజ్?

- Advertisement -

అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. అయినా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పుష్ప పాటలు అన్ని చోట్లా ట్రెండ్ అవుతున్నాయి. రెండవ భాగం పుష్ప: ది రూల్‌లో పుష్పరాజ్ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలని ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

సుకుమార్ మరియు అతని బృందం చాలా సమయాన్ని వెచ్చించి మరీ స్క్రిప్ట్‌ని మళ్లీ మళ్లీ రాసారు. పుష్ప పార్ట్ 2 ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో, పకడ్బందీ కథనంతో ఉన్నత స్థాయిలో రూపొందించబడుతుందని సమాచారం. నిజానికి ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

న్యూ ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో, అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తానని ధృవీకరించారు. డిసెంబర్ 2021లో పుష్ప విడుదలైనప్పటి నుండి అల్లు అర్జున్ విరామంలోనే ఉన్నారు. పుష్ప 1 దక్షిణాది నుండి వచ్చిన అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. త్వరలోనే సీక్వెల్ షూటింగ్‌ ప్రారంభించబోతున్నామని, వచ్చే ఏడాది సినిమా విడుదలవుతుందని ఆశిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు.

READ  భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న రష్మిక మందన్న

పుష్ప సీక్వెల్ కోసం బన్నీ ఫోటో షూట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. మరో వైపు బ్యాంకాక్-శ్రీలంక అడవుల్లో అరుదైన లొకేషన్లను వెతికే పనిలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ అడవుల్లో పుష్పరాజ్‌కి, పులికి మధ్య జరిగే భీకర పోరాటాన్ని చిత్రీకరించనున్నారట.

ఈ పోరాటాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా షూట్ చేయబోతున్నప్పటికీ సహజంగా ఉండేలా సుకుమార్ అండ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలే RRR సినిమాలో పులి ఫైట్ సీక్వెన్స్‌తో ఉన్న ఎన్టీఆర్ పరిచయ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మరి సుకుమార్ ఇలాంటి ఫైట్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాలి.

పుష్ప-2 విడుదల తేదీ పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ చిత్రం డిసెంబర్ 2023 లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp

READ  బాహుబలి, కేజీఎఫ్ సినిమాల తరహాలో ఇతర భాషల్లో రాణించలేకపోయిన పొన్నియిన్ సెల్వన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories