లోక నాయకుడు కమలహాసన్ యువ నటుడు శింబు కలయికలో మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా థగ్ లైఫ్. ప్రారంభం నుంచి కూడా ఈ క్రేజీ ప్రాజెక్టు పై అందరిలో విశేషమైన అంచనాలు ఉన్నాయి. విక్రమ్ సక్సెస్ తరువాత కమల్ చేస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తోనే మంచి అంచనాల ఏర్పరిచిన థగ్ లైఫ్ సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన థియేటర్ ట్రైలర్ అంచనాలు అమాంతంగా పెంచేసింది. తమిళ్ తో పాటు ఇటు తెలుగు ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై భారీ స్థాయి క్రేజ్ ఉంది.
అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా ఓవర్సీస్ బ్రేకీవెన్ సాధించాలంటే మొత్తం 18 మిలియన్ల యుఎస్ డాలర్లు అందుకోవాలి. ఈ మూవీ యొక్క యొక్క ఓవర్సీస్ రైట్స్ రూ. 63 కోట్లకు అమ్ముడు అయ్యాయి. ఒకరకంగా ఇది కోలీవుడ్ లోబెస్ట్ డీల్ అని చెప్పాలి.
మరోవైపు కమలహాసన్ కి కూడా ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉండటం, ఇక శింబు వంటి నటుడు ఉండటం అలానే మణిరత్నం కాంబినేషన్ కావడంతో టాక్ గనక బాగా ఉంటే ఈ కలెక్షన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి జూన్ 5న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ ఏ స్థాయి విజయవంతం అవుతుందో చూడాలి.