మణిరత్నం దర్శికత్వంలో తాజాగా లోకనాయకుడు కమలహాసన్, శింబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా థగ్ లైఫ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయి భారీ మాస్ యాక్షన్ సన్నివేశాలతో అందరినీ ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు అయితే ఏర్పరిచింది.
ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 5న గ్రాండ్ లెవెల్ లో పలుభాషల ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే తాజాగా ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి యు / ఏ సర్టిఫికెట్ ని సెన్సార్ సభ్యులు అందించారు.
ఓవరాల్ గా 165 నిమిషాల నిడివి గల థగ్ లైఫ్ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అలానే దర్శకుడుగా మణిరత్నంకి ఇది మరొక సక్సెస్ ని అందిస్తుందని చెప్తున్నారు. మరోవైపు పొన్నియన్ సెల్వం రెండు సినిమాలు బాగానే ఆడినప్పటికీ మణిరత్నం మార్క్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.
కాగా ఆ కోరికని ఈ సినిమా తీరుస్తుందని టాక్. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ ప్రకారం ఇది మాఫియా కథాంశంతో సాగుతుందట. మాఫియా ప్రపంచంలో, శక్తివేల్ మరియు అతని సోదరుడు మాణికం పోలీసులతో జరిగిన భయంకరమైన కాల్పుల నుండి అమరన్ అనే యువకుడిని రక్షించి దత్తత తీసుకుంటారు.
తరువాత శక్తివేల్ పై హత్యాయత్నం జరుగుతుంది, దానిపై అతను అమరన్ ను అనుమానిస్తాడు. అతను తన సోదరుడు మరియు తనను మోసం చేసిన తన దత్తపుత్రుడిపై ప్రతీకారం తీర్చుకోవడం అనే ఇంట్రెస్టింగ్ కథనంతో ఈ మూవీ సాగుతుందట.