మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఇటీవల ఎంపురాన్ మూవీ ద్వారా మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా శోభనతో కలిసి ఆయన చేసిన మూవీ తుడరమ్ ఈ మూవీని తరుణ్ మూర్తి తెరకెక్కించగా జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో మంచి క్రేజ్ తో కొనసాగుతోంది.
ఇప్పటికే రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ మూవీ 9వ రోజు కూడా కేరళలో రూ. 6 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఇక ఇది ఓపెనింగ్ డే కంటే ఎక్కువ కావడం మరింత విశేషంగా చెప్పుకోవాలి. ఇక 10వ రోజు కూడా ఇప్పటికే రూ.5 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ జరుపుకుంది తుడరుమ్ మూవీ.
ఆ విధంగా మలయాళం మూవీ హిస్టరీలో వరుసగా మొదటి పది రోజులు రూ. 5 కోట్ల మేర కలెక్షన్ దక్కించుకున్న మూవీగా పెద్ద రికార్డు నెలకొల్పింది. కేవలం కేరళలోనే రూ. 59 కోట్లు రాబట్టిన ఈ మోవి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ క్లోసింగ్ లో రూ. 150 కోట్లు కలెక్షన్ అందుకునే అవకాశం కనపడుతోంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితిని చూస్తే, మొత్తంగా కేరళలో రూ. 100 కోట్లు అందుకునే మూవీగా కూడా ఇది సాగుతోంది.