Homeసినిమా వార్తలుమరొక అద్భుత రికార్డు సొంతం చేసుకున్న 'తుడరుమ్'

మరొక అద్భుత రికార్డు సొంతం చేసుకున్న ‘తుడరుమ్’

- Advertisement -

మోహన్ లాల్ హీరోగా శోభన హీరోయిన్ గా యువ దర్శకుడు తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తుడరుమ్. ఇప్పటికే ఎంపురాన్ మూవీతో పెద్ద విజయం అందుకుని పెద్ద రికార్డు సొంతం చేసుకున్న మోహన్ లాల్, తాజాగా తుడరుమ్ తో మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 

బెంజ్ అనే ఒక మధ్య తరగతి కారు డ్రైవర్ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా తెరకెక్కిన తుడరుమ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొంది అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ తో అలానే అటు కేరళలో రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ తో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ దూసుకెళ్తోంది.

తాజాగా ఈమూవీ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో కూడా ఒక అద్భుతమైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. గతంలో మంజుమ్మేల్ బాయ్స్ నెలకొల్పిన అత్యధిక టికెట్ సేల్స్ రికార్డుని ఇది బద్దలుకొట్టింది. బుక్ మై షో లో 43.5 లక్షల టికెట్ల సేల్స్ తో తుడరుమ్ అత్యధిక టికెట్స్ బుకింగ్ జరుపుకున్న మూవీగా నిలిచింది.

READ  'పెద్ది' గురించి రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మొత్తంగా అటు కలెక్షన్ల పరంగా అలానే ఇటు బుక్ మై షో లో అన్ని విధాలుగా కూడా తుడరుమ్ మూవీకి భారీ స్థాయి రెస్పాన్స్ లభిస్తుండడంతో టీం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇటు తెలుగులో కూడా ఈ మూవీకి బాగానే కలెక్షన్స్ లభిస్తున్నాయి. మరి ఓవరాల్ గా ఇది ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories