మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఇటీవల ఎంపురాన్ సినిమాతో పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.
దాని అనంతరం తాజాగా యువ దర్శకుడు తరుణ్ మూర్తి దర్శకత్వంలో శోభనాతో కలిసి మోహన్ లాల్ నటించినటువంటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తుడరుమ్.
ఈ సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి ప్రస్తుతం బాక్సాఫీస్ పరంగా భారీ విజయం దిశగా కొనసాగుతోంది. కేవలం కేరళలోనే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తంగా గడిచిన 26 రోజుల్లో రూ. 225 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ దక్కించుకొని మోహన్ లాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.
ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో 10.9 మిలియన్లను అందుకుంది. అంతకుముందు మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఓవరాల్ గా రూ. 242 కోట్లతో అత్యధిక కలెక్షన్ అందుకున్న మలయాళ మూవీగా టాప్ స్థానంలో నిలవగా దాని అనంతరం తుడరుమ్ సినిమా ప్రస్తుతం రూ. 225 కోట్ల వద్ద ఉంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క బాక్సాఫీస్ రన్ ని బట్టి చూస్తే ఇది త్వరలోనే మంజుమ్మేల్ బాయ్స్ ని దాటేసే అవకాశం ఎక్కువగా కూడా కనపడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.