Homeసినిమా వార్తలుThree Tier Security for SSMB29 Shooting SSMB 29 : మూడంచెల భద్రత మధ్య...

Three Tier Security for SSMB29 Shooting SSMB 29 : మూడంచెల భద్రత మధ్య షూటింగ్

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ గ్రోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29. ఈ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలున్నాయి. 

విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఒడిశాలోని కోరాపూట్ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. 

అయితే ఈ సినిమా నుంచి అనూహ్యంగా ఊహించని విధంగా ఒక లీక్ వీడియో రెండు రోజలుగా సోషల్ మీడియాలో ప్రచారమై విపరీతంగా వైరల్ అయింది. అయితే వెంటనే అలెర్ట్ అయిన SSMB 29 మూవీ టీం దానిపై గట్టిగా చర్యలు తీసుకుని వాటిని తొలగించే ప్రయత్నం చేసింది. కాగా విషయం ఏమిటంటే ఇకపై తమ సినిమా నుంచి ఎటువంటి కంటెంట్ లీక్ కాకుండా షూటింగ్ స్పాట్ లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారట దర్శకుడు రాజమౌళి. 

READ  He was not Music Director for Allu Arjun Atlee Movie అల్లు అర్జున్ - అట్లీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అతను కాదా ?

ముఖ్యంగా టీంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో నిశితంగా తనిఖీ చేసి సెట్స్ లోకి అనుమతిస్తున్నారట. ఇకపై సినిమా నుంచి పక్కాగా ఏది లీక్ కాకుండా చూసుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా రానుందని తెలుస్తోంది. కాగా ఈ మూవీని 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. 

Follow on Google News Follow on Whatsapp

READ  SSMB 29 : Priyanka Chopra Intresting Role SSMB 29 : ఇంట్రెస్టింగ్ రోల్ లో ప్రియాంక చోప్రా ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories